Homeగాసిప్స్మెగాస్టార్ గాడ్ ఫాదర్ లో బాలీవుడ్ కండల వీరుడు

మెగాస్టార్ గాడ్ ఫాదర్ లో బాలీవుడ్ కండల వీరుడు

మెగాస్టార్ గాడ్ ఫాదర్ లో బాలీవుడ్ కండల వీరుడు
మెగాస్టార్ గాడ్ ఫాదర్ లో బాలీవుడ్ కండల వీరుడు

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలంతా ప్యాన్ ఇండియా బాట పడుతున్నారు. టాప్ హీరోలతో పాటు మీడియం రేంజ్ ఉన్న హీరోలు కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో చిత్రాలు చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం ప్యాన్ ఇండియా రేంజ్ లో చిత్రం చేయబోతున్నట్లు వినికిడి. ఆచార్య చిత్రాన్ని పూర్తి చేసిన మెగాస్టార్ రేపటినుండి మలయాళం రీమేక్ లూసిఫెర్ లో నటిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్ లో నిర్మించాలని భావిస్తున్నారు. గాడ్ ఫాదర్ టైటిల్ గా పరిగణింపబడుతోన్న ఈ చిత్రంలో స్పెషల్ పాత్ర ఒకటి ఉంటుంది. మలయాళంలో పృథ్వీరాజ్ ఆ పాత్రను పోషించాడు. ఇప్పుడు అదే పాత్రను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేస్తాడని వినికిడి.

- Advertisement -

సల్మాన్ అయితే ఇండియా వైడ్ అటెన్షన్ ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నారు. స్వయంగా మెగాస్టార్ ఫోన్ చేసి అడగడంతో సల్మాన్ కూడా ఎస్ అన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నుండి సల్మాన్ ఖాన్ ఈ చిత్రానికి డేట్స్ ఇవ్వనున్నాడు. గాడ్ ఫాదర్ చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం త్వరలో బయటకు రానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All