Homeటాప్ స్టోరీస్ఫుల్ స్వింగ్ లో గాడ్ ఫాదర్ మ్యూజిక్ సెషన్స్

ఫుల్ స్వింగ్ లో గాడ్ ఫాదర్ మ్యూజిక్ సెషన్స్

ఫుల్ స్వింగ్ లో గాడ్ ఫాదర్ మ్యూజిక్ సెషన్స్
ఫుల్ స్వింగ్ లో గాడ్ ఫాదర్ మ్యూజిక్ సెషన్స్

ఎస్ ఎస్ థమన్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. టాలీవుడ్ లో కచ్చితంగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే థమన్ పేరు చెప్పాల్సిందే. బడా ప్రాజెక్ట్స్ అన్నీ తన పాకెట్ లో వేసుకుంటున్నాడు థమన్. సూపర్బ్ ఫ్లో లో సినిమాలు చేస్తూ సూపర్ హిట్ ఆల్బమ్స్ అందిస్తోన్న థమన్ కు మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి పనిచేసే అవకాశం దొరికింది.

మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి చేస్తోన్న గాడ్ ఫాదర్ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడన్న విషయం తెల్సిందే. తొలిసారి మెగాస్టార్ చిత్రానికి పనిచేసే అవకాశం రావడంతో థమన్ ఎక్కడా తగ్గను అంటున్నాడు. ప్రస్తుతం మోహన్ రాజా పర్యవేక్షణలో గాడ్ ఫాదర్ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. పలు ట్యూన్స్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. సినిమాటోగ్రాఫర్ నిరవ్ షా కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొన్నాడు.

- Advertisement -

రీసెంట్ గా మొదలైన గాడ్ ఫాదర్ షూటింగ్ ఊటీలో షార్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ ఉంటుంది. మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసిఫెర్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. నయనతార ప్రముఖ పాత్ర పోషిస్తుండగా సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ చేస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All