Homeగాసిప్స్అనసూయ కు చిరు స్వీట్ వార్నింగ్

అనసూయ కు చిరు స్వీట్ వార్నింగ్

chiranjeevi warning to anasuya
chiranjeevi warning to anasuya

బుల్లితెర ఫై ఓ పక్క యాంకర్ గా రాణిస్తూనే మరోపక్క వెండితెరపై వరుస ఛాన్సులు అందుకుంటూ ప్రేక్షకులను , అభిమానులను అలరిస్తుంది. ఈ మధ్యనే పుష్ప లో దాక్షాయణి గా అదరగొట్టిన అనసూయ..ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా కలయికలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ చిత్రంలో ఓ కీలక రోల్ లో నటిస్తుంది. ఇటీవలె ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేశారట. అయితే సెట్‌లో అనసూయకు చిరంజీవి వార్నింగ్‌ ఇచ్చినట్లు ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వార్త చూసిన చాలామంది అనసూయకు వార్నింగ్‌ ఎందుకు ఇచ్చారంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే ఆ వార్నింగ్ రియల్‌ లైఫ్‌లో జరిగింది కాదు.. కేవలం రీల్‌లో మాత్రమే. ఈ సినిమాలో అనసూయ నెగిటివ్‌ షేడ్స్‌తో కనిపిస్తుందట. ఓ సన్నివేశంలో భాగంగా అనసూయ కు చిరంజీవి వార్నింగ్ ఇచ్చాడట. అంతే తప్ప మరోటి కాదు.

- Advertisement -

చరణ్ – నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. చిరంజీవి – సల్మాన్ కాంబినేషన్లోని సీన్స్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All