Homeటాప్ స్టోరీస్హనుమాన్ జయంతి రోజు..చరణ్ వీడియో షేర్ చేసి ఫ్యాన్స్ ను మైమరపించిన చిరంజీవి

హనుమాన్ జయంతి రోజు..చరణ్ వీడియో షేర్ చేసి ఫ్యాన్స్ ను మైమరపించిన చిరంజీవి

ఈరోజు హనుమాన్ జయంతి సందర్బంగా చిరంజీవి ..మెగా అభిమానుల కోసం ఓ అరుదైన వీడియో చేసి ఆకట్టుకున్నారు. హనుమంతుడు మెగాస్టార్ చిరంజీవి ఇష్టం దైవం అన్న సంగతి తెలిసిందే. అంజనేయస్వామికి చిన్ననాటి నుంచి అపారమైన భక్తుడు. ప్రతీ ఏడాది హనుమంతుడి వేడుకని ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటారు. తండ్రి నుంచి అదే అలవాటు తనయుడు రామ్ చరణ్ కి వచ్చింది.

- Advertisement -

అందుకే ఇష్టదైవం లోగోని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పై అచ్చు వేయించారు. కాగా హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి తనయుడికి చెందిన ఓ వీడియోని షేర్ చేసారు. అందులో రామ్ చరణ్ ‘ఆచార్య’ సినిమా షూటింగ్లో భాగంగా ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో మేకప్ వేసుకుంటుండగా..ఓ కోతి లోపలికి వచ్చింది. దాన్ని చూసిన చరణ్ కాసేపు ఆటపట్టించాడు. బీస్కెట్లు తినిపించి హనుమంతుడిపై ప్రేమను చాటుకున్నారు. శ్రీ ఆంజనేయం..ప్రసన్న ఆంజనేయం సాంగ్ ని ఆవీడియోకి సింక్ చేసి దాన్ని చిరు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట మరోసారి వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All