Homeన్యూస్వరుస దైవ దర్శనాలతో మెగాస్టార్ బిజీ

వరుస దైవ దర్శనాలతో మెగాస్టార్ బిజీ

వరుస దైవ దర్శనాలతో మెగాస్టార్ బిజీ
వరుస దైవ దర్శనాలతో మెగాస్టార్ బిజీ

మెగాస్టార్ చిరంజీవి గత కొద్దీ రోజులుగా వరుస దైవ దర్శనాలు చేస్తూ బిజీ గా ఉన్నారు. ఫిబ్రవరి 13 న ముచ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహాన్ని సతీసమేతంగా సందర్శించారు. ఆశ్రమానికి విచ్చేసిన చిరంజీవి సురేఖ దంపతులకు చినజీయర్ స్వామి ఆశీర్వచనాలు పలికారు. చినజీయర్ స్వామి చేతుమీదుగా సమతామూర్తి ప్రతిమను చిరంజీవి అందించారు. ఆ తర్వాత శ‌బ‌రి మ‌ల‌కు వెళ్లారు. అక్క‌డ అయ్య‌ప్ప స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. శ‌బ‌రిమ‌లై నుండి గురువాయూర్‌కు వెళ్లారు.

ఫిబ్ర‌వ‌రి 12 సాయంత్రం నుంచి 13 సాయంత్రం వ‌ర‌కు జ‌రిగిన ఆధ్యాత్మిక యాత్ర చ‌క్క‌గా ముగిసింద‌ని స్వయంగా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. చిరంజీవి దంప‌తుల‌తో ఫొనిక్స్ సురేష్ దంప‌తులు కూడా ఉన్నారు.

- Advertisement -

ఈ ఆధ్యాత్మిక యాత్ర‌కు సంబంధించిన వీడియో షేర్ చేశారు చిరంజీవి. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య మూవీ ని పూర్తి చేసారు. సెట్స్ ఫై భోళా శంకర్ , గాడ్ ఫాదర్ సినిమాలను ఉంచి..వరుస షూటింగ్ లతో బిజీ గా ఉన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All