
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచానాలు నెలకొని ఉన్నాయి. ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్లలో చిరంజీవి , చరణ్ , కొరటాల శివ లు బిజీ గా ఉన్నారు. వరుస ఇంటర్వూస్ లలో ఆసక్తికర విషయాలు షేర్ చేస్తూ వస్తున్నారు.
ఈ వయసులో మీరు ఇంత ఉత్సాహంగా ఎలా పని చేయగలుగుతున్నారు ?’ అనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో చిరంజీవికి ఎదురైంది. అందుకు చిరంజీవి తనదైన స్టైల్లో స్పందించారు. “ఇప్పుడు నా చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయని అనుకుంటున్నారు .. మరో ఐదు కథలు కూడా రెడీ అవుతున్నాయి. ఇటీవల ‘గాడ్ ఫాదర్’ షూటింగును రాత్రివేళలోనే చేయవలసి వచ్చింది. ఆ తరువాత బాబీ సినిమాకి కూడా రాత్రివేళలోనే పని చేయవలసి వచ్చింది. అయినా నేను అలసటగా ఫీలవ్వలేదు. మరింత ఉత్సాహంతో పనిచేశాను. ఎంతో పుణ్యం చేసుకోవడం వల్లనే నేను సినిమాల్లోకి వచ్చానని అనుకుంటూ ఉంటాను. ఇక్కడ వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకోవడానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలి. అలా నేను పడే కష్టమే నన్ను మరింత ఆరోగ్యవంతుడిని చేసి ముందుకు నడిపిస్తోంది” అని చెప్పుకొచ్చారు.