
ఎస్ ఎస్ థమన్ టైమ్ అసలు మాములుగా నడవట్లేదు. వరసగా టాప్ హీరోల సినిమాలు అన్నీ చేస్తున్నాడు థమన్. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు చిత్రాలకు పనిచేస్తున్నాడు. అలాగే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాకు కూడా వర్క్ చేయనున్నాడు. చిరంజీవి మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫెర్ చిత్రాన్ని రీమేక్ చేయనున్న విషయం తెల్సిందే.
గతేడాదే లాంచ్ అయిన ఈ చిత్రం వివిధ కారణాల కారణంగా పట్టాలెక్కలేదు. అయితే ఈ ఆలస్యం కారణంగా రకరకాల రూమర్స్ చక్కర్లు కొట్టడం మొదలైంది. లూసిఫెర్ రీమేక్ ను పూర్తిగా పక్కన పెట్టేశారని కూడా అన్నారు. కానీ అవేమి నిజాలు కావని కన్ఫర్మ్ అయింది.
లూసిఫెర్ రీమేక్ మ్యూజిక్ సెషన్స్ మొదలయ్యాయి. దర్శకుడు మోహన్ రాజా, ఎస్ ఎస్ థమన్ కలిసి ఒక సెల్ఫీను షేర్ చేసారు. మ్యూజిక్ సెషన్ మొదలైన విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. ఎన్వీ ప్రసాద్, రామ్ చరణ్ లు నిర్మిస్తోన్న ఈ సినిమా కాస్టింగ్ ప్రాసెస్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది.