
ఆ మధ్య రంగస్థలం సినిమా విడుదల సమయంలో ఆది పాత్ర చనిపోయేటప్పుడు రామ్ చరణ్ పలికించిన భావోద్వేగాలు అద్భుతంగా ఉన్నాయంటూ చిరు ముందే లీక్ చేసిన విషయం తెల్సిందే. అయితే అది సినిమాకి హెల్ప్ అయిందనే చెప్పాలి. ప్రేక్షకుడిని ముందే ఆ సీన్ కి ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడింది.
ఇప్పుడు కూడా చిరు లీక్ చేసేసాడు. అప్పుడంటే సినిమా విడుదలకు ముందు లీక్ చేసిన చిరంజీవి ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు ఇంకా ఆరు నెలలకి పైగా సమయమున్నా కూడా లీక్ చేసేసాడు. ఇంతకీ ఏం చేసాడంటే..
ఆ మధ్య చిరంజీవి, సురేఖతో కలిసి ఆర్ ఆర్ ఆర్ సినిమా సెట్స్ కు వెళ్లారట. అక్కడ ఒక సన్నివేశం కోసం రామ్ చరణ్ శ్రమిస్తున్న తీరుకి వారి గుండెలు బరువెక్కాయట. అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ ఆ సమయంలో స్వతంత్ర పోరాటానికి ముందు ప్రిపేర్ అయ్యే సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారట. ఈ లీక్ చిత్రానికి ఏ విధంగా హెల్ప్ అవుతుందో చూడాలి.
