Homeన్యూస్మూడు సినిమాల షూటింగ్స్ తో బిజీగా మెగాస్టార్

మూడు సినిమాల షూటింగ్స్ తో బిజీగా మెగాస్టార్

మూడు సినిమాల షూటింగ్స్ తో బిజీగా మెగాస్టార్
మూడు సినిమాల షూటింగ్స్ తో బిజీగా మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి గతంలో కూడా మల్టీపుల్ ప్రాజెక్ట్స్ చేసాడు కానీ రీసెంట్ కాలంలో ఒకటి తర్వాత ఒకటిగా సినిమాలు చేస్తున్నాడు. 2019లో వచ్చిన సైరా తర్వాత మెగాస్టార్ నుండి సినిమా వచ్చింది లేదు. అయితే వచ్చే ఏడాది మాత్రం మూడు, వీలయితే నాలుగు సినిమాలను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడు మెగాస్టార్.

కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రాన్ని పూర్తి చేసాడు. ఈ సినిమా ఫిబ్రవరి 4, 2021న విడుదల కానుంది. గత రెండు నెలలుగా గాడ్ ఫాదర్ చిత్ర షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. ఇక ఈరోజు నుండి భోళా శంకర్ షూటింగ్ ను మొదలుపెడుతున్నారు చిరు. హైదరాబాద్ లోనే చిత్ర షూటింగ్ జరుగుతోంది. తమన్నా ఈ సినిమాలో కథానాయిక కాగా కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో నటిస్తోంది.

- Advertisement -

డిసెంబర్ నుండి బాబీ చిత్రాన్ని కూడా మొదలుపెట్టాలని చిరు భావిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉంటుంది. అలాగే బ్రేక్ ఇచ్చిన గాడ్ ఫాదర్ షూటింగ్ ను కూడా డిసెంబర్ లో తిరిగి మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక రానున్న ఆరేడు నెలలు ఈ మూడు చిత్రాల షూటింగ్స్ తో చిరు బిజీ బిజీగా గడపనున్నాడన్నమాట.

ఇవి కూడా చదవండి:
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All