
దర్శకుడనే పదానికి వన్నె తెచ్చిన దర్శకులలో ముందు వరుసలో నిలిచిన వ్యక్తి దర్శకరత్న డా. దాసరి నారాయణ రావు. భారతదేశంలో వున్న గొప్ప దర్శకులలో ఆయన ఒకరు. `తాతా మనవడు` చిత్రంతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి 150కి పైగా చిత్రాలు చేశారాయన. డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటూ దర్శకుడే ప్రధానం అని వాదించారాయన. అలాంటి దర్శకరత్న జయంతి నేడు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్‌లని అందించి దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. దాసరి తెరకెక్కించిన చాలా చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలతో పాటు జాతీయ స్థాయిలో పలు అవార్డులు దక్కాయి. అయితే సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వాలు ఆయనకు సముచిత గౌరవాన్ని ఇవ్వకపోవడం విచారకరం.
దాసరి జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కొత్త డిమాండ్‌ని లేవనెత్తారు. దాసరికి పద్మ పురస్కారం ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. `దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి జయంతి సందర్భంగా ఆయనకు నా స్మృత్యంజలి. ఒక సినిమాకు మించి మరో సినిమాని తన అపూర్వ దర్శకత్వ ప్రతిభతో మలచడమే కాదు నిరంతరం చిత్ర పరిశ్రలోని సమస్యలని పరిష్కారానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మార్గదర్శకమే. ఇప్పటికీ తగిన ప్రభుత్వ గుర్తింపు ఆయనకు దక్కకపోవడం తీరని లోటు. ఇకనైనా ఆయనకి పద్మ పురస్కారం దక్కితే అది మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవంగా భావిస్తాం` అని ట్వీట్ చేశారు. అంతే కాకుండా
తన ట్వీట్‌కు #RememberingALegend #DrDasari #PadmaForDrDasari హ్యాష్ ట్యాగ్‌లని జతచేశారు.
#RememberingALegend #DrDasari #PadmaForDrDasari pic.twitter.com/pasn1g2YWr
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 4, 2021