Homeగాసిప్స్చిరు ఆ రీమేక్ ను పూర్తిగా పక్కన పెట్టేస్తినట్లేనా?

చిరు ఆ రీమేక్ ను పూర్తిగా పక్కన పెట్టేస్తినట్లేనా?

చిరు ఆ రీమేక్ ను పూర్తిగా పక్కన పెట్టేస్తినట్లేనా?
చిరు ఆ రీమేక్ ను పూర్తిగా పక్కన పెట్టేస్తినట్లేనా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య షూటింగ్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఆచార్య షూటింగ్ సమయంలోనే చిరంజీవి వరసగా మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి మలయాళం సూపర్ హిట్ లూసిఫెర్ రీమేక్ కాగా, వేదాళం రీమేక్ మరొకటి, బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ మూడవది.

ఇప్పటికే లూసిఫెర్ రీమేక్ కు చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ వచ్చాయి. ముందుగా సుజీత్ ను దర్శకుడిగా అనుకున్నారు తర్వాత లైన్లోకి వివి వినాయక్ వచ్చాడు. ఇప్పుడు తమిళ దర్శకుడు మోహన్ రాజాను లూసిఫెర్ రీమేక్ కు దర్శకుడిగా ఎంచుకున్నారు. చిత్రాన్ని ఏడాది మొదట్లో అఫిషియల్ గా లాంచ్ చేసారు కూడా. ఆచార్య పూర్తైన వెంటనే లూసిఫెర్ రీమేక్ షూటింగ్ ను కూడా మొదలుపెడదామని ప్లాన్ చేసారు.

- Advertisement -

అయితే తాజా సమాచారం ప్రకారం చిరంజీవి లూసిఫెర్ ప్రాజెక్ట్ పై ఆసక్తిని కోల్పోయాడట. ఈ రీమేక్ తెలుగు వారి అభిరుచులకు సరిపోదని చిరు భావిస్తున్నాడు. దీంతో లూసిఫెర్ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేయడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చేసాడట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All