Homeటాప్ స్టోరీస్మూడు రాజధానులపై చిరు స్టేట్మెంట్స్.. ఏది రియల్? ఏది ఫేక్??

మూడు రాజధానులపై చిరు స్టేట్మెంట్స్.. ఏది రియల్? ఏది ఫేక్??

మూడు రాజధానులపై చిరు స్టేట్మెంట్స్.. ఏది రియల్? ఏది ఫేక్??
మూడు రాజధానులపై చిరు స్టేట్మెంట్స్.. ఏది రియల్? ఏది ఫేక్??

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మూడు రాజధానుల గురించి ఒక ప్రపోజల్ పెట్టిన విషయం తెల్సిందే. అమరావతి, కర్నూల్, వైజాగ్ లను రాజధానులుగా మార్చే అవకాశం ఉందంటూ చేసిన స్టేట్మెంట్ కు భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు దీన్ని సమర్దిస్తుంటే, మరికొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయాన్ని దుయ్యబడుతూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెల్సిందే. ఏ మీటింగ్ లో పాల్గొన్నా ఈ నిర్ణయంపై జగన్ ను ఏకిపారేస్తున్నారు. ఇదిలా ఉంటే మొన్న చిరంజీవి నుండి అంటూ ఒక ప్రెస్ నోట్ వచ్చింది. దీని ప్రకారం మూడు రాజధానుల నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు ఆ నోట్ లో ఉంది. దీనిపై పెద్ద దుమారమే రేగింది. మెగా ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయి దీనిపై చర్చించుకోవడం కనిపించింది.

అయితే నిన్న అంటే 22న మరో ప్రెస్ నోట్ వచ్చింది. తాను మూడు రాజధానులపై ఎటువంటి ప్రెస్ నోట్ విడుదల చేయలేదని, ప్రస్తుతం తన దృష్టాంతా సినిమాల మీదే ఉందన్నది దాని సారాంశం. ఇలా రెండు రోజుల్లో రెండు భిన్న ప్రెస్ నోట్స్ రావడంతో మెగా ఫ్యాన్స్ లో, జనసైనికులలో ఒకింత ఆందోళన నెలకొంది. అయితే తాజాగా దీనిపై మరో క్లారిఫికేషన్ వచ్చింది. రాజధానుల నిర్ణయంపై తాను ఎటువంటి ప్రకటన చేయలేదు అంటూ వచ్చిన ప్రెస్ నోట్ ఫేక్ అని చిరంజీవి చెబుతున్నట్లుగా ఒక ఆడియో క్లిప్, మరో నోట్ మీడియాకు విడుదల చేసారు.

- Advertisement -

దీని బట్టి అర్ధం చేసుకోవాల్సింది. మూడు రాజధానుల నిర్ణయంపై చిరంజీవి స్పందించారు. ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే ఆ ఆడియో క్లిప్ ను మిమిక్రీ చేసారంటూ ఇప్పుడు జనసైనికులు కొత్త వాదన మొదలుపెట్టారు. చిరంజీవి ఇటువంటి ప్రకటన చేసి ఉండరని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు.

ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అన్నదమ్ములైనంత మాత్రాన ఇద్దరికీ ఒకేలాంటి అభిప్రాయాలు ఉండాలని లేదు. అలా ఉన్నంత మాత్రాన అదేమీ తప్పు కాదు. భిన్నాభిప్రాయాలు ఉన్నా వారిద్దరూ ఒకటి కాకుండా పోలేరు. సో, మూడు రాజధానుల నిర్ణయం అనే కాదు, భవిష్యత్తులో ఏ నిర్ణయంపైనైనా చిరంజీవి, పవన్ కళ్యాణ్ విభేదించవచ్చు. దీనిపై రాద్ధాంతం అనవసరం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All