
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా స్టార్ చిరంజీవి గతంలో కలిసి నటించారు అనేకంటే ఒకరి సినిమాల్లో మరొకరు క్యామియో పాత్రలు పోషించారు అనొచ్చు. అయితే తొలిసారి వీరిద్దరూ కలిసి ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారు. చిరంజీవి లీడ్ రోల్ లో రూపొందుతోన్న ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. వీరిద్దరికీ సంబంధించిన టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. మెగా ఫ్యాన్స్ కు వీరి కాంబినేషన్ వీనుల విందుగా ఉంటుందని సమాచారం.
ఇదిలా ఉంటే చిరు, చరణ్ లు ఆచార్యలో సాంగ్ షూట్ లో పాల్గొంటారట. ఇప్పటికే ఈ సాంగ్ కు సంబంధించిన సెట్ వర్క్ పూర్తయింది. త్వరలోనే ఈ సాంగ్ చిత్రీకరణను ప్రారంభిస్తారు. ఈ సాంగ్ కాకుండా చరణ్, పూజ హెగ్డేలపై కూడా ఒక సాంగ్ ను చిత్రీకరించాల్సి ఉంది. ఈ రెండు సాంగ్స్ తో ఆచార్య షూటింగ్ పూర్తవుతుంది.
కాజల్ అగర్వాల్ చిరంజీవి పెయిర్ గా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.