
టైటిల్ చూసి ఏంటి అనుకుంటున్నారా..ఇది చిరంజీవి లేటెస్ట్ యాడ్ లో జరిగిన దానిగురించి చెపుతున్నాం. తాజాగా చిరంజీవి సుకుమార్ డైరెక్షన్లో శుభగృహ రియల్ ఎస్టేట్ యాడ్ లో నటించాడు. ఈ యాడ్ లో చిరంజీవి వైఫ్ గా కుష్బూ నటించగా..అనసూయ కీలక రోల్ చేసింది.
యాడ్ విషయానికి వస్తే..
చిరంజీవి క్యారెక్టర్ తన భార్యకు మంచి సర్ప్రైజ్ ఇవ్వాలని సిద్ధమవుతూ ఉంటాడు. ఇక వైఫ్ క్యారెక్టర్ లో వచ్చిన ఖుష్బూ ఈ రోజు ఏంటో గుర్తుందా మీకు అనగానే.. అందుకు మెగాస్టార్ ఇంటి అద్దె కదా కట్టేద్దాం అని అంటాడు. ఇక ఆ తరువాత సడన్ గా అనసూయ నుంచి ఫోన్ కాల్ రాగానే భార్య అనుమానిస్తుంది. తన ఫ్రెండ్ గౌతమ్ అని చిరు అబద్ధం కూడా చెబుతాడు. మౌనపోరాటం మూవీకి సీక్వెల్.. ఈటీవీలో సీరియల్‌గా.. ప్రసారం ఎప్పుడంటే? అనసూయ, చిరు అలా.. వారిని ఫాలో అవుతూ ఉండగా అనసూయ మెగాస్టార్ ను కలుస్తుంది.
లెట్ అయ్యింది ఏమిటి అనగానే నువ్వు ఫోన్ చేసినప్పుడు తను పక్కనే ఉంది తెలుసా అంటూ.. కానీ తెలియకుండా మ్యానేజ్ చేశానని అంటాడు. ఇక ఆ తరువాత అపార్ట్మెంట్ లోని ఒక రూమ్ లోకి వాళ్లిద్దరూ క్లోజ్ గా వెళ్లడం చూసిన ఖుష్బూ చాలా కోపంగా లోపలికి వెళుతుంది. లోపలికి వెళ్ళగానే అక్కడ ఊహించని వాతావరణం కనిపిస్తుంది. తన భార్య పుట్టినరోజు సందర్భంగా సొంతింటి కలను నిజం చేయాలని అనుకుంటున్నట్లు మెగాస్టార్ సంతకాలు పెడతారు. ఇక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ శుభగృహ ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తారు. శుభగృహ రియల్ ఎస్టేట్ కు సంబంధించిన ఈ యాడ్ ఫిల్మ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
