Homeటాప్ స్టోరీస్మొత్తానికి చిరుకు తొలిరోజు అలా గడిచింది

మొత్తానికి చిరుకు తొలిరోజు అలా గడిచింది

మొత్తానికి చిరుకు తొలిరోజు అలా గడిచింది
మొత్తానికి చిరుకు తొలిరోజు అలా గడిచింది

ఉగాది పర్వదినాన మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. మొత్తానికి సోషల్ మీడియాలో చిరు ఎంట్రీ జరిగిపోయింది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో చిరు అకౌంట్స్ తెరిచాడు. మొదటి ట్వీట్ గా చిరంజీవి అందరికీ శార్వరి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి ఈ కష్ట సమయంలో ఇంటిపట్టునే ఉండి సురక్షితంగా ఉండాలని పిలుపునిచ్చాడు. అలాగే రెండో ట్వీట్ లో ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి అందరూ 21 రోజులు ఇంటి పట్టునే ఉండాలని తెలిపాడు. నరేంద్ర మోదీ, కేసీఆర్, జగన్ గార్లు ఇచ్చిన సలహాలను పాటిద్దామని పేర్కొన్నాడు. అలాగే ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మొదటి ట్వీట్ ను  పిన్ చేసాడు.

ఆ తర్వాత కూడా చిరంజీవి యాక్టివ్ గానే ఉన్నాడు. సినిమాకు సంబందించిన మొదటి ట్వీట్ ను చేసాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా మోషన్ పోస్టర్ విడుదలయ్యాక దాన్ని పొగుడుతూ ట్వీట్ చేసాడు. ఈ మోషన్ పోస్టర్ కు సంబంధించి అందరినీ పొగడడం విశేషం. దీన్ని చూసాక రోమాలు నిక్కబొడుచుకున్నాయని తెలిపాడు. అలాగే సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన కీరవాణికి, ఎస్ ఎస్ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లను అద్భుతమైన వర్క్ చేస్తున్నారని పొగిడాడు. వీరందరిలో తన కొడుకైన చరణ్ ను చివర్లో పొగడడం విశేషం.

- Advertisement -

ఆ తర్వాత చిరంజీవి తనను ట్విట్టర్ లోకి ఆహ్వానించిన పలువురు సెలెబ్రిటీలకు రిప్లైలు ఇచ్చారు. వారిలో రాజమౌళి, నాగార్జున, సుహాసిని, మోహన్ లాల్, రాధిక వంటి వారు ఉన్నారు. ఇక సాయంత్రం హోమ్ టైమ్.. మామ్ టైమ్ అంటూ ట్వీట్ చేసాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో పెద్ద వాళ్ళను జాగ్రత్తగా చూసుకుందామని పిలుపునిచ్చాడు. దీంతో పాటు తమ తమ తల్లులతో తీసుకున్న సెల్ఫీలను తనకు పంపాలని కోరాడు. ఇదే పోస్ట్ ను ఇన్స్టాగ్రామ్ లో కూడా షేర్ చేసాడు. అక్కడ అదే మొదటి ట్వీట్.

ఈ రకంగా చిరంజీవి నిన్నంతా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. మరి ఇదే ఫ్లో ను రానున్న రోజుల్లో కూడా చూపిస్తాడేమో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All