Homeటాప్ స్టోరీస్చి ల సౌ రివ్యూ

చి ల సౌ రివ్యూ

chi la sow movie reviewచి ల సౌ రివ్యూ :
నటీనటులు : సుశాంత్ , రుహాణి శర్మ , వెన్నెల కిషోర్
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాతలు : అక్కినేని నాగార్జున , జస్వంత్ , భరత్ కుమార్
దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 3 ఆగస్టు 2018

హీరోగా , సహాయ నటుడిగా పలు చిత్రాల్లో నటించిన రాహుల్ రవీంద్రన్ మెగాఫోన్ చేతబట్టిన చిత్రం ” చి ల సౌ ”. నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంతో హిట్ కొట్టాడా ? నాగార్జున ని ఈ సినిమా మెప్పించిన విధానం ఏంటి ? ప్రేక్షకులను అలరించేలా ఈ చిలసౌ రూపొందిందా ? లేదా ? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .

కథ :

- Advertisement -

ఇప్పుడే పెళ్లి చేసుకోనని పట్టుబట్టే అర్జున్ ( సుశాంత్ ) తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు పెళ్లి చూపులకు మాత్రం ఒప్పుకుంటాడు . దాంతో సంతోషించిన అర్జున్ తల్లిదండ్రులు వెరైటీ గా పెళ్లి చూపులను ఏర్పాటు చేస్తారు . అంజలి ( రుహాణి శర్మ )తండ్రి చనిపోవడంతో కుటుంబానికి పేద దిక్కుగా ఉంటుంది అంజలి అయితే బాధ్యతలను వదిలేసి పెళ్లి చేసుకోవాలంటే ఇష్టం ఉండదు అంజలి కి కానీ అంజలి తల్లి ఒత్తిడి మేరకు పెళ్లి చూపులకు వెళ్తుంది అర్జున్ ని చూడటానికి . పెళ్లంటే ఇష్టం లేని ఇద్దరు పెళ్లి చూపుల్లో కలిసాక ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

సుశాంత్
రుహాణి శర్మ
కథ
కథనం
ఎంటర్ టైన్ మెంట్
సెకండాఫ్

డ్రా బ్యాక్స్ :

ఫస్టాఫ్ లో కొన్ని బోరింగ్ సన్నివేశాలు
పాటలు

నటీనటుల ప్రతిభ :

పెళ్లంటే ఇష్టం లేని అర్జున్ పాత్రలో సుశాంత్ బాగా నటించాడు . ఇన్నాళ్లు సక్సెస్ కోసం ఆరాటపడుతున్న , పోరాడుతున్న సుశాంత్ కు ఈ సినిమా పూర్తిస్థాయి హిట్ ని ఇవ్వకపోయినా మంచి పేరు తీసుకురావడం ఖాయం . నటుడుగా మంచి పరిణతి సాధించాడు సుశాంత్ . రుహాణి శర్మ తన ప్రతిభ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది . మొదటి సినిమానే అయినప్పటికీ మంచి నటనని ప్రదర్శించింది రుహాణి శర్మ . ఇక వెన్నెల కిషోర్ పాత్ర ఈ సినిమాకు ప్లస్ అయ్యింది నవ్వులతో అలరించాడు వెన్నెల కిషోర్ . మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :

హీరోగా నటుడిగా రాణిస్తున్న రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే . తొలిప్రయత్నం లోనే దర్శకుడిగా మెప్పించాడు రాహుల్ . అయితే ఫస్టాఫ్ ని మరింత పకడ్బందీగా రాసుకొని ఉంటే బాగుండేది అలాగే స్లో నెరేషన్ కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ దర్శకుడిగా మాత్రం భేష్ అనిపించాడు రాహుల్ . నిర్మాణ విలువలు బాగున్నాయి , ప్రశాంత్ నేపథ్య సంగీతం తో అలరించాడు . ఛాయాగ్రహణం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది .

ఓవరాల్ గా :

విభిన్న తరహా చిత్రాలను కోరుకునే కుర్రకారు కి నచ్చే చిలసౌ

English Title: chi la sow movie review

                                    Click here for English Review
YouTube video

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All