Sunday, September 25, 2022
Homeటాప్ స్టోరీస్ఓ ఖైదీ రియ‌ల్ స్టోరీ స్ఫూర్తిగా `చెక్‌` చేశా: చ‌ంద్ర‌శేఖ‌ర్ ఏలేటి.

ఓ ఖైదీ రియ‌ల్ స్టోరీ స్ఫూర్తిగా `చెక్‌` చేశా: చ‌ంద్ర‌శేఖ‌ర్ ఏలేటి.

Check is inspired by us prisoners real story
Check is inspired by us prisoners real story

యంగ్ హీరో నితిన్ పెళ్లి త‌రువాత స్పీడు పెంచారు. వ‌రుస‌గా సినిమాల్ని లైన్‌లో పెట్టారు. అంతే స్పీడుతో వాటిని పూర్తి చేసి రాబోయే నాలుగు నెలల్లో మూడు చిత్రాలని వ‌రుస‌గా రిలీజ్ చేస్తున్నాడు. దీంతో నితిన్ ప్లాన్ కి మిగ‌తా స్టార్స్ అవాక్క‌వుతున్నార‌ట‌. నితిన్ లైన్‌లో పెట్టిన మూడు చిత్రాల్లో మొదటిది `చెక్`. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ఈ చిత్రానికి దర్శకుడు. దేశ ద్రోహం కేసుకింది ఉరిశిక్ష ప‌డిన ఓ ఖైదీ క‌థ నేప‌థ్యంలో ఈ మూవీ సాగుతుంది.

- Advertisement -

ర‌కుల్ ప్రీత్‌సింగ్, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌లుగా న‌టించారు. విభిన్న‌మైన స్టోరీతో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగే ఈ మూవీ ఈ నెల 26 న విడుదలవుతోంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం మీడియాతో డైరెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తికర విష‌యాల్ని వెల్ల‌డించారు. ఓ వ్య‌క్తి నిజ జీవిత క‌థ స్ఫూర్తితో ఈ మూవీని చేశాన‌ని చెప్పారు.

`అమెరికాలో జైలు శిక్ష ప‌డిన ఓ వ్య‌క్తి  చెస్ ఆడిన న‌ట్టు నేను చదివాను. అక్క‌డి నుంచే `చెక్` స్టోరీ పుట్టింది. 70 నుంచి 80 శాతం సినిమా అంతా జైలులోనే సాగుతుంది. సిన‌మాలో లాయ‌ర్‌గా ర‌కుల్ ప్రీత్ న‌టించింది. అయితే చాలా భ‌య‌స్తురాలు..క్ర క్ర‌మంగా ధైర్య‌వంతురాలిగా మారుతుంది. ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌ది ఫ్లాష్ బ్యాక్‌లో వ‌చ్చే పాత్ర‌. చాలా కీల‌క‌మైన పాత్ర‌. నితిన్ ల‌వ‌ర్‌గా క‌నిపిస్తుంది. నితిన్‌తో రెండు మూడు క‌థ‌లు అనుకుని చివ‌రికి దీనికి ఫిక్స‌య్యాం. చెక్ స‌రికొత్త పాయింట్‌తో రూపొందిన క‌మ‌ర్షియ‌ల్ సినిమా` అన్నారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts