Homeటాప్ స్టోరీస్తప్పుడు ప్రచారం అయ్యింది... మా సమస్య ఎప్పుడో అయిపోయింది...

తప్పుడు ప్రచారం అయ్యింది… మా సమస్య ఎప్పుడో అయిపోయింది…

Kona Venkat
తప్పుడు ప్రచారం అయ్యింది… మా సమస్య ఎప్పుడో అయిపోయింది…

టాలీవుడ్ టాప్ స్టార్ రైటర్ ‘కోన వెంకట్’ సినిమాలలోని మాటలు, మాటల తూటాలు హీరోల నైజాన్ని పెంచేవి. అలా చాలా పెద్ద సినిమాలకి పనిచేసిన కోన గారు తర్వాత విమర్శకుల పాలు అయ్యారు. తనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది అంటూ ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. సినిమా కథ ఇస్తానని 2017లో 13.50 లక్షలు తీసుకున్నారని అవి అడిగితే బెదిరిస్తున్నారని కేసు నమోదయింది.

కోన వెంకట్ పై, జెమినీ ఎఫ్.ఎక్స్ డైరెక్టర్ ప్రసాద్ కేసు పెడుతూ జూబ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కోన వెంకట్ పై 406.. 420 కేసులను నమోదు చేసారని ప్రచారమైంది. అలా కోన వెంకట్ ఇస్తారన్న కథ సంగతి అటు పెడితే ఇలా కేసు లో ఇరుక్కోవటం ఏంటి అని అందరూ ఆశ్యర్య పోయారు. ఆ కథ ఇన్నాళ్టికి ముగిసింది. నిజానికి అలాంటి కథనాలు ఏమి లేవని జూబ్లీ పోలీసులకి ఒక లేఖ వచ్చింది అంటా. అది రాసింది స్వయానా కేసు పెట్టిన జెమినీ ఎఫ్.ఎక్స్ డైరెక్టర్ ప్రసాద్ గారే అంటా.

- Advertisement -

ఈ వివాదం తమ మధ్య సమసిపోయిందని జెమిని ఎఫ్.ఎక్స్ ఇన్ ఛార్జ్ (జూబ్లీహిల్స్ ఆఫీస్) ఆర్.వి.ప్రసాద్ ఓ లేఖ రాశారు. ”మిస్ కమ్యూనికేషన్ వల్ల తప్పు జరిగింది. ఎలక్ట్రానిక్.. ప్రింట్ మీడియాలలో ప్రచారం అయిన ఆ వార్త సరికాదు. సరైన వివరాలు లేకుండా తప్పుడు ప్రచారం జరిగింది. ఈ వార్తను ప్రచారం చేసింది ఎవరో వారికి చెబుతున్నా. ఈ సమస్య మా ఇద్దరి మధ్యలో సెటిలైపోయింది. ఎలాంటి అపార్థాలు మా మధ్య లేవు”.. అని లేఖలో సృష్టంగా రాసారంటా.

మొత్తానికి ఇన్నాళ్టికి వారిరువురు సామరస్యంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకున్నారని అర్థమవుతోంది. కోన ప్రస్తుతం వరుసగా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క ప్రధాన పాత్రలో ‘నిశ్శబ్ధం’ అనే బహుభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయనే ఈ చిత్రానికి రచయిత కూడా. ఇప్పటివరకు హీరోలని తీర్చిదిద్దిన కోన గారు, హీరోయిన్ అనుష్కకి ఎంతటి ఘనవిజయాన్ని అందిస్తాడో చూద్దాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All