మాజీ హీరోయిన్ సింధూ మీనన్ పై చీటింగ్ కేసు నమోదు అయ్యింది . తెలుగు , తమిళ , మలయాళ బాషలలో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ సినిమాలకు గుడ్ బై చెప్పి 2010 లో ప్రభు అనే వ్యక్తి ని పెళ్లి చేసుకుంది . అయితే సింధు మీనన్ పేరుతో ఆమె సోదరుడు బ్యాంక్ ఆఫ్ బరోడా లో కారు లోన్ తీసుకున్నాడు గత ఏడాది , ఖరీదైన కారు లోన్ సోదరి పేరు మీద తీసుకున్నాడు కానీ సకాలంలో ఒక్క ప్రీమియం కూడా కట్టకపోవడంతో బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసారు .
- Advertisement -
సింధూ మీనన్ పై కేసు నమోదు అయినప్పటికీ ఆమె ఇక్కడ లేదు ప్రస్తుతం లండన్ లో ఉంటోంది . తెలుగులో శ్రీరామచంద్రలు , భద్రాచలం , చందమామ లాంటి హిట్ చిత్రాల్లో నటించింది సింధూ మీనన్ , అలాగే వీటితో పాటు పలు తెలుగు చిత్రాల్లో కూడా నటించింది .
- Advertisement -