Homeటాప్ స్టోరీస్నేను చెడ్డదాన్ని అంటున్న ఛార్మి

నేను చెడ్డదాన్ని అంటున్న ఛార్మి

charmi sensational comments on her love storyప్రేమలో ఓడిపోయానని అందుకే నాకు ప్రేమపై అలాగే పెళ్లి పై అంతగా నమ్మకం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది మాజీ హీరోయిన్ ఛార్మి . ఈ భామ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ని ప్రేమించిన విషయం తెలిసిందే . అయితే అధికారికంగా దేవిశ్రీ ప్రసాద్ పేరు ఎక్కడా చెప్పలేదు కానీ సినిమా రంగంలోని వాళ్లకు పూర్తిగా ఛార్మి – దేవిశ్రీ ల ప్రేమ వ్యవహారం తెలుసు . అయితే పెళ్లి వరకు వెళుతుందన్న వాళ్ళ వ్యవహారం ముగిసిపోయింది దాంతో డిప్రెషన్ కి లోనయ్యింది ఛార్మి .

అయినా నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంటే అతడితో పూర్తికాలం కాపురం చేయలేక విడాకులు తీసుకునే వాళ్లమని ఎందుకంటే అతడు మంచివాడే కానీ నేనే చెడ్డదాన్ని అంటూ బాంబ్ పేల్చింది ఛార్మి . పెళ్లి చేసుకొని భర్తని చూసుకొని కాపురం చేసేంత తీరిక నాకు లేదని అందుకే పెళ్లి పై , ప్రేమ పై నాకు నమ్మకం లేదని ఇకముందు కూడా ఉండదని వేదాంతం చెబుతోంది ఛార్మి . మొత్తానికి ప్రేమలో పడి బాగానే దెబ్బతింది పాపం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All