
చిత్రసీమలో లైంగిక వేదింపులు అనేవి కామన్..కానీ వీటి గురించి బయటకు చెప్పడం చేసేవారు కాదు ..కానీ ఇప్పుడు మీటూ ఉద్యమం ద్వారా ప్రతి ఒక్కరు తమకు ఏదైనా వేధింపులను బయటకు తెలియజేస్తున్నారు. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య ఫై కూడా ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గణేశ్‌కి అసిస్టెంట్‌గా పని చేసిన ఓ మహిళా కొరియోగ్రాఫర్.. తనని లైగింక వేధించడంటూ 2020లో కేసు నమోదు చేసింది. 2019లో శృంగారంలో పాల్గొనాలని గణేశ్ తనని బలవంతం చేశాడని ఆ లేడీ కొరియోగ్రాఫర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తన అసిస్టెంట్స్‌తో దాడి చేయించినట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా ఘటన ఆమె గురించి మాట్లాడుతూ.. ‘ఆయన మహిళా అసిస్టెంట్స్ నన్ను కొట్టారు. దుర్భాషలాడారు. దీంతో నాన్ కాగ్నిసబుల్ కేసు నమోదు చేశాను. అనంతరం తదుపరి చర్యల కోసం లాయర్‌ను కాంటాక్ట్ అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చింది.
తాజాగా గణేశ్‌పై అంథేరీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు ఓషివారా స్టేషన్‌కు చెందిన దర్యాప్తు పోలీసు అధికారి సందీప్ షిండే వెల్లడించారు. అతనితో పాటు అతని సహాయకుడిపై 354-ఎ (లైంగిక వేధింపులు), 354-సి (వోయూరిజం), 354-డి (వెంబడించడం), 509 (మహిళను అవమానించడం), 323 (బాధ కలిగించడం), 504 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు.