Homeగాసిప్స్చరణ్ ఫస్ట్ లుక్.. ఈసారైనా పక్కానా?

చరణ్ ఫస్ట్ లుక్.. ఈసారైనా పక్కానా?

చరణ్ ఫస్ట్ లుక్.. ఈసారైనా పక్కానా?
చరణ్ ఫస్ట్ లుక్.. ఈసారైనా పక్కానా?

ఆర్ ఆర్ ఆర్.. గతేడాది నుండి ప్రేక్షకులు ఎక్కువగా వింటున్న పేరు. సినిమా రిలీజ్ కు ఇంకా చాలా సమయమున్నా ఏదోక అప్డేట్ తో ప్రేక్షకుల నోళ్ళలో నానుతోంది ఈ చిత్రం. దీనికి రాజమౌళి దర్శకుడన్నది ఒక కారణమైతే, రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఈ సినిమా చేస్తుండడం మరో కారణం. అయితే ప్రతి రాజమౌళి సినిమాలనే ఇది కూడా షూటింగ్ ఆలస్యమవ్వడం మూలాన ఈ ఏడాది జులైకి విడుదల కావాల్సిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి షిఫ్ట్ అయిపోయింది. దీంతో ఫ్యాన్స్ కొంత నీరుగారినా, సినిమా ఎప్పుడు వచ్చినా తాము గర్వపడే రీతిలోనే ఉంటుంది కాబట్టి సర్ది చెప్పుకున్నారు. అయితే గతేడాది కాలం నుండి అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ ఆర్ ఆర్ ఆర్ టీమ్ ను అడుగుతూ వస్తోంది అప్డేట్స్ గురించే. ఈ సినిమా అప్డేట్స్ విషయంలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ బొత్తిగా స్పందించకపోవడంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కూడా వివిధ రకాల మీమ్స్ చేసిన విషయం తెల్సిందే.

ఏదైనా పండగ వస్తోందంటే గతేడాది నుండి ఆర్ ఆర్ ఆర్ నుండి అప్డేట్ వస్తుందని ప్రచారం జరగడం, తర్వాత అలాంటిదేం లేకపోవడం జరుగుతూ వస్తోంది. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్.. ఇలా వేడుక ఏదైనా హీరోల ఫస్ట్ లుక్స్ కానీ టైటిల్ ఎక్స్పెన్షన్ కానీ లేదు.

- Advertisement -

అయితే ఈసారి కచ్చితంగా అప్డేట్ ఉంటుందని చెబుతున్నారు ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు సన్నిహితంగా ఉండే కొందరు వ్యక్తులు. మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి సీతారామరాజు లుక్ లో ఉన్న చరణ్ ఫస్ట్ లుక్ వస్తుందని కొత్త రూమర్స్ మొదలయ్యాయి. అలాగే మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో కొమరం భీమ్ లుక్ లో ఉన్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని, వీటితో ప్రచారం షురూ అవుతుందని అంటున్నారు. చూద్దాం మరి ఈసారైనా నిజంగా జరుగుతుందో లేక రూమర్ గానే మిగిలిపోతుందో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All