
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. భారీ అంచనాల మధ్య నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. ఫస్ట్ డే ఏకంగా వరల్డ్ వైడ్ గా రూ. 250 కోట్ల కు పైగా కలెక్షన్లు సాధించి గత తెలుగు చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేసింది. సినిమా ఎంత పెద్ద విజయం సాధించడం పట్ల రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భాంగా సోషల్ మీడియా ద్వారా అన్ని భాషల్లో నోట్ రిలీజ్ చేసారు.
రాజమౌళి గారి ఆర్ఆర్ఆర్ సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతో ఉత్సాహంగా ఈ సినిమా చూసిన అందరికీ నా కృతజ్ఞతలు.. ఈ అపూర్వమైన పుట్టినరోజు బహుమానాన్ని బాధ్యతతో స్వీకరిస్తాను అని చెప్పుకొచ్చాడు. అన్నట్టు రేపు(మార్చి27) చరణ్ బర్త్ డే..ఈ బర్త్ డే కు ఆర్ఆర్ఆర్ ఎప్పటికి మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చినట్లు అయ్యింది.
Thank You ?? pic.twitter.com/689w1QMl2w
— Ram Charan (@AlwaysRamCharan) March 26, 2022