
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచానాలు నెలకొని ఉన్నాయి. ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్ లలో చిత్ర యూనిట్ బిజీ గా ఉన్నారు. డైరెక్టర్ కొరటాల శివ, రామ్ చరణ్ లు వరుసగా ఇంటర్వూస్ ఇస్తూ సినిమా ఫై ఆసక్తి పెంచుతున్నారు.
తాజాగా చిత్ర ప్రమోషన్ లలో చరణ్ మాట్లాడుతూ..ఆచార్య సినిమా చేయడానికి రాజమౌళినే కారణమన్నారు. రాజమౌళి గారి ఆర్ఆర్ఆర్ లో నేను ఒక గెటప్ లో ఉన్నాను. అందువలన ఆయన మధ్యలో మరో సినిమా చేయడానికి ఒప్పుకోరు. కానీ నాన్న .. నేను కలిసి తెరపై కాస్త ఎక్కువసేపు కనిపించాలనే కోరిక అమ్మకి బలంగా ఉంది. అందువలన నాన్న రిక్వెస్ట్ చేయడంతో రాజమౌళి కాదనలేకపోయారు. ‘ఆర్ఆర్ఆర్’ లుక్ కి దగ్గరగా సిద్ధ పాత్ర ఉండటం లక్కీగా కలిసొచ్చింది. అయితే ఆ పాత్రకీ .. ఈ పాత్రకి ఎంతమాత్రం పోలిక ఉండదు. రెండూ కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేని విభిన్నమైన పాత్రలు. ‘ఆచార్య’ సినిమా చేయడానికి ఓకే చెప్పిన రాజమౌళి గారికి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ‘ఆర్ ఆర్ ఆర్’లోను .. ‘ఆచార్య’లోను ఆ పాత్రలు నా వ్యక్తిత్వానికి దగ్గరగా అనిపించడం వల్లనేమో నేను మరింత ఈజీగా చేయగలిగాను” అని చెప్పుకొచ్చాడు.