
మాచో స్టార్ ‘గోపీచంద్’ కి ఇప్పుడు సినిమా హిట్ నిజంగా అవసరం, ఎంతలా అంటే ఇప్పుడు వచ్చే ‘చాణక్య’ సినిమా కనుక హిట్ అవ్వకపోతే జనాలు అతగాడిని పట్టించుకోరు అని ‘గోపీచంద్‘ గారికి తెలిసిన విషయమే. గత సంవత్సరం ‘పంతం’ అంటూ వచ్చిన సినిమా కథ, కథనం పరంగా బాగున్నా కొత్త డైరెక్టర్ కాబట్టి కొద్దిలో తప్పి ప్లాప్ సినిమాగా మారింది.
అయితే తన ఫ్యాన్స్ కి ‘చాణక్య’ థియేట్రికల్ ట్రైలర్ చూపించి సినిమా మీద బాగా హైప్ పెంచేసాడు. అందులోను ‘సైరా నరసింహా రెడ్డి’ అక్టోబర్ 02 న విడుదల అవుతుండాగా, చాణక్య 05 వ తారీఖున విడుదల అవుతుంది. మరి చిరంజీవి పోటీగా వస్తున్న గోపీచంద్ పరిస్థితి ఏంటి అని చాలా మంది గుసగుసలాడుతున్నారు. అయితే ఇప్పుడు ‘చాణక్య’ టీం కి ఒక సవాలు వచ్చింది, అది పెద్ద సమస్యే అని చెప్పాలి.
విషయానికి వస్తే చాణక్య 05 వ తారీఖున విడుదల అవుతుంది కదా.. మెగా కుటుంబానికి చెందిన సన్నిహితులు థియేటర్ యజమానులకు ఫోన్ చేసి ‘చాణక్య’కు థియేటర్లు ఇవ్వొద్దు’ అని బెదిరిస్తున్నారని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. పండగ అయ్యేంత వరకూ సైరా సినిమా ఆడాలని.. అలా జరగాలంటే – ‘చాణక్య’కు థియేటర్లు ఇవ్వకూడదని.. గట్టిగా చెబుతున్నారట. సన్నిహితుల చేతిలో కొన్ని థియేటర్లు కూడా ఉన్నాయి. పరిశ్రమలో కాస్తపలుకుబడి ఉన్న వ్యక్తులు కాబట్టి వాళ్ళ మాటలకు ఎవరైనా విలువ ఇస్తారు. ఒక రకంగా సినిమా విలువ కూడా పెంచుతున్నారు.
మరి చాణక్య సినిమాకి ఇంకా ఇలాంటి ఇబ్బందులు బాగానే వస్తాయి, మంచిగా ఇంకొక డేట్ చూసుకొని రిలీజ్ చేయడం మంచిది అని అనుకుంటున్నారు సినిమా వర్గాలు. చూద్దాం మరి ఏమి జరుగుతుందో?