Homeటాప్ స్టోరీస్ఉక్రెయిన్‌ ఫై రష్యా యుద్ధం..ఏపీలో భీమ్లా ఫై జగన్ యుద్ధం - చంద్రబాబు

ఉక్రెయిన్‌ ఫై రష్యా యుద్ధం..ఏపీలో భీమ్లా ఫై జగన్ యుద్ధం – చంద్రబాబు

chandrababu supports bheemla nayak

పసికూన ఉక్రెయిన్ మీద రష్యా మిలటరీ ఆపరేషన్ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ లోని చెర్నోబిల్ పవర్ ప్లాంట్ ను స్వాధీనం చేసుకున్న రష్యా ఆదేశాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. అన్ని దేశాలు దాడులు ఆపాలని కోరుతున్న రష్యా మాత్రం ఆపడం లేదు. మరోపక్క తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం ఉక్రెయిన్ లో ఉండడంతో వారిని సురక్షితంగా తీసుకరావాలని తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు చేస్తుంటే..జగన్ సర్కార్ మాత్రం భీమ్లా నాయక్ ఫై ఫోకస్ చేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు.

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ గా పవన్ అభిమానులు సంబరాల్లో ఉంటె..ఏపీ లో మాత్రం పవన్ అభిమానులు పూర్తి నిరాశతో ఉన్నారు. దీనికి కారణం భీమ్లా నాయక్ ప్రదర్శిస్తున్న థియేటర్స్ ఫై జగన్ కక్ష్య సాధింపు చర్య చేపట్టడమే. దీనిపై అంత విమర్శలు కురిపిస్తుండగా..తాజాగా చంద్రబాబు ఫై జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. తన ట్విట్టర్ లో వరుస ట్వీట్స్ పెట్టాడు.

- Advertisement -

* రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సీఎం వైఎస్ జగన్ వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోంది’ అని అన్నారు.

మరో ట్వీట్‌లో భారతీ సిమెంట్‌ రేట్లను ప్రస్తావిస్తూ ‘వ్యక్తులను టార్గెట్‌గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీ సిమెంట్ రేటుపై లేని నియంత్రణ భీమ్లా నాయక్ సినిమాపై ఎందుకు? ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్ తన మూర్ఖపు వైఖరి వీడాలి’ అని డిమాండ్ చేశారు.

మూడో ట్వీట్ లో ‘రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి… థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరం. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే… ఆంధ్ర ప్రదేశ్ సిఎం మాత్రం భీమ్లా నాయక్‌పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారు. తెలుగు దేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది.. నిలదీస్తుంది. భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.

అలాగే చంద్రబాబు తనయుడు లోకేష్ సైతం జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసాడు. ‘భీమ్లా నాయక్‌కు మంచి స్పందన వస్తోంది. దీన్ని చూడాలని అనుకుంటున్నా. ప్రతి పరిశ్రమను మూసేస్తూ జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నాడు. సినీ పరిశ్రమ దీనికి మినహాయింపు కాదు. అన్ని కుట్రలను అధిగమించి సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All