
జూనియర్ ఎన్టీఆర్ ని కలిశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . ఈరోజు నందమూరి హరికృష్ణ సంవత్సరీకం కావడంతో హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు చంద్రబాబు . దాంతో జూనియర్ ఎన్టీఆర్ , నందమూరి కళ్యాణ్ రామ్ లు సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు ని . హరికృష్ణ చిత్ర పటానికి నివాళులు అర్పించిన అనంతరం జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశమయ్యారు చంద్రబాబు .
నందమూరి – నారా కుటుంబ సభ్యులు మళ్ళీ చాలాకాలం తర్వాత ఈ సంవత్సరీకం సందర్బంగా కలుసుకున్నారు . తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఓడిపోయిన విషయం తెలిసిందే . ఇక తెలంగాణలో అయితే పూర్తిగా కనుమరుగయ్యింది , ఏపీలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది . ఇలాంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే పార్టీకి దిక్కు అన్నట్లుగా చర్చ జరుగుతోంది . అయితే జూనియర్ ఎన్టీఆర్ దృష్టి అంతా ఇప్పుడు సినిమాలమీదే ఉంది మరి .