Homeటాప్ స్టోరీస్దేవిని వెనక్కి నెట్టడానికి థమన్ కిదే అవకాశం

దేవిని వెనక్కి నెట్టడానికి థమన్ కిదే అవకాశం

Chance for Thaman to replace DSP
Chance for Thaman to replace DSP

మెలోడీ బ్రహ్మ మణిశర్మ కొంచెం ఫేడవుట్ అయ్యాక దేవిశ్రీ ప్రసాద్ టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. చాలా త్వరగానే టాప్ ప్లేస్ కు చేరుకున్న దేవి దాదాపు దశాబ్దన్నర పాటు తన పాటలతో శ్రోతల్ని అలరించాడు. ఇదే సమయంలో మణిశర్మ శిష్యుడు థమన్ ఇండస్ట్రీకొచ్చినా దేవి స్థానాన్ని కదపలేకపోయాడు. థమన్ సంగీత సారధ్యంలో కూడా మంచి పాటలు వచ్చినా దేవి తర్వాతి స్థానంలోనే కొనసాగుతూ వచ్చాడు.

మరోవైపు థమన్ పాటలు కాపీ కొడతాడు అన్న అపవాదు కూడా టాప్ స్థానానికి ఎదగనీయలేదు. అయితే గత రెండేళ్లుగా పరిస్థితిలో మార్పు వచ్చింది. దేవిశ్రీ మ్యూజిక్ లో క్వాలిటీ బాగా తగ్గింది. మరోవైపు థమన్ తనను తాను మార్చుకుంటూ అప్డేట్ అవుతున్నాడు. ఈ రెండేళ్లలో థమన్ మ్యూజిక్ దేవి మ్యూజిక్ కన్నా బాగుంది అని సంగీత ప్రేక్షకులు ఎవరైనా చెప్పగలరు.

- Advertisement -

ఇప్పుడు థమన్, దేవిశ్రీని దాటటానికి అనువైన సమయం వచ్చింది. వచ్చే సంక్రాంతికి అటు థమన్ స్వరపరిచిన అల వైకుంఠపురములో, దేవిశ్రీ సంగీత సారథ్యంలో సరిలేరు నీకెవ్వరు సినిమాల ఆల్బమ్స్ వస్తాయి. సినిమాల మధ్య పోటీనే కాకుండా ఆల్బమ్స్ మధ్య పోటీ కూడా ఉంటుంది. మరి ఇద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All