Homeటాప్ స్టోరీస్అరవ దర్శకుడి కుక్క కామెడీకి ప్రేక్షకులు బలి

అరవ దర్శకుడి కుక్క కామెడీకి ప్రేక్షకులు బలి

అరవ దర్శకుడి కుక్క కామెడీకి ప్రేక్షకులు బలి
అరవ దర్శకుడి కుక్క కామెడీకి ప్రేక్షకులు బలి

పక్కపక్కనే ఉన్నా తమిళ్ సినీ ప్రేక్షకులకు, తెలుగు ప్రేక్షకులకు అభిరుచుల రీత్యా చాలా తేడాలుంటాయి. వారివి భిన్నమైన టేస్ట్ లు. అక్కడి వారు సహజత్వాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. తెలుగు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అక్కడ కొంచెం అతిగా ఉన్నా కూడా నడుస్తుంది. మన దగ్గర సటిల్ నెస్ ఉండాలి. అందుకే అక్కడి దర్శకులు ఇక్కడ, ఇక్కడి దర్శకులు అక్కడ చేసినా పెద్దగా సక్సెస్ సాధించలేదు.

రీసెంట్ గా తమిళ దర్శకుడు తిరు తెలుగులో దర్శకత్వం వహించిన చిత్రం చాణక్య. దసరా సెలవుల్లో సైరా మంచి దూకుడు మీద ఉన్న సమయంలో విడుదలైన చాణక్య.. నెగటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పూర్తిగా డల్ అయిపోయాయి. మహా అయితే 5 కోట్లు రావడం కూడా కష్టమనే భావన విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. సినిమా ఎలా ఉంది అన్న విషయం పక్కన పెడితే ఇందులో పెట్టిన కామెడీ ట్రాక్ ను చూసి ప్రేక్షకులు తమను చూసి తామే నవ్వుకునే పరిస్థితి.

- Advertisement -

అలీ ఈ చిత్రంలో డాగ్ డాక్టర్ గా నటించాడు. గోపీచంద్ ఒక రా ఏజెంట్ కానీ బయటకి బ్యాంక్ ఎంప్లాయ్. సినిమాలో గోపీచంద్ – మెహ్రీన్ – అలీల మధ్య వచ్చే కుక్క ఎపిసోడ్, కామెడీనే అపహాస్యం చేసే పరిస్థితి. తమిళ సినిమాల్లో కామెడీ మన దానికి పూర్తిగా భిన్నం. తెలుగులో సినిమా చేసేటప్పుడు మన ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకోకుండా తక్కువ చేయడంతో తిరుని ఇప్పుడు అందరూ విమర్శిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All