Homeటాప్ స్టోరీస్నాని గజదొంగ గా నటిస్తే యాక్సెప్ట్ చేస్తారా

నాని గజదొంగ గా నటిస్తే యాక్సెప్ట్ చేస్తారా

challenging role for naniతెలుగులో ఇప్పుడు బయోపిక్ ల హవా నడుస్తోంది , మహానటి సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు ఆ బయోపిక్ లకు ఊపొచ్చింది అయితే ఆ బయోపిక్ లు వేరు వాటికీ భిన్నంగా స్టువర్ట్ పురం గజదొంగ అయిన ” టైగర్ నాగేశ్వర్ రావు ” బయోపిక్ ని రూపొందించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు . నాని కి ఈ కథ చెప్పగానే వెంటనే నటించడానికి ఒప్పేసుకున్నాడట ! వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది .

టైగర్ నాగేశ్వర్ రావు హడలెత్తించిన గజదొంగ , ఆ పేరు వింటేనే నిలువెల్లా వణికిపోయే వాళ్ళట ! 1980 – 90 మధ్య కాలంలో ప్రజల వెన్నులో వణుకు పుట్టించిన గజదొంగ ఈ టైగర్ నాగేశ్వర్ రావు , అయితే అలాంటి గజదొంగ కథ తో తెరకెక్కుతున్న చిత్రంలో నాని గజదొంగ గా నటించనున్నాడు మరి నాని ని గజదొంగ గా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా ? అన్నది పెద్ద ప్రశ్న ఎందుకంటే నాని అంటే పక్కింటి అబ్బాయి అన్న ఫీలింగ్ ఉంది దాంతో ఆ క్యారెక్టర్ కోసం తనని తానూ చాలా మలుచుకోవాల్సి ఉంటుంది . నాని ప్రస్తుతం ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు .

- Advertisement -

English Title: challenging role for nani

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All