Homeగాసిప్స్కొత్తదనం లేదు కానీ ఎంటర్ టైన్ మెంట్ ఉంది

కొత్తదనం లేదు కానీ ఎంటర్ టైన్ మెంట్ ఉంది

YouTube video

నిన్న సాయంత్రం చల్ మోహన్ రంగ ట్రైలర్ విడుదల అయ్యింది అయితే ఈ ట్రైలర్ లో కొత్తదనం అంటూ ఏమి లేదు కానీ కాస్త త్రివిక్రమ్ స్టయిల్ లో కట్ చేసారు . ఇంకో విశేషం ఏంటంటే ఈ ట్రైలర్ చూస్తుంటే రొమాన్స్ కి ఎంటర్ టైన్ మెంట్ కి ఎక్కడా డోకా లేనట్లుగా ఉంది దాంతో సినిమా హిట్ అవ్వడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం . నితిన్ – మేఘా ఆకాష్ జంటగా నటించిన ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ , సుధాకర్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మించారు .

ఏప్రిల్ 5 న ఈ చిత్రం విడుదల అవుతోంది , తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు . త్రివిక్రమ్ , పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి భాగస్వాములు కావడంతో చల్ మోహన్ రంగ చిత్రానికి కాస్త క్రేజ్ వచ్చింది . నితిన్ గత చిత్రం లై అతిపెద్ద డిజాస్టర్ అయ్యింది , దాంతో ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు . మరి ప్రేక్షకులు ఆదరిస్తారో లేక లై లాగే తిప్పి కొడతారో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All