
`బాణం` చిత్రంతో దర్శకుడిగా చైతన్య దంతులూరి మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. అయితే ఆ మూవీ తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నారు. ఏడేళ్ల క్రితం బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌తో చేసిన `బసంతి` కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో కొంత విరామం తీసుకున్న ఆయన ఏడేళ్ల విరామం తరువాత మళ్లీ మెగా ఫోన్ పడుతున్నారు.
చైతన్య దంతులూరి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `భళా తందనాన`. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్నారు. సాయి శివాని సమర్పణలో వారాహి చలన చిత్రం, సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది.
కేథరిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల `గాలి సంపత్` చయిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీవిష్ణు తాజా చిత్రంలో ఓ విభిన్నమైన గెటప్‌లో సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. క్లాప్ బోర్డ్ వెనకాల తీక్షణంగా చూస్తూ బారీ హెయిర్ కట్‌తో కనిపిస్తున్న శ్రీవిష్ణు లుక్ ఆకట్టుకుంటోంది. `కేజీఎఫ్` ఫేమ్ రామచంద్రరాజు ఇందులో మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.
Lights????Camera ???? Action ????#BhalaThandanana shoot begins today????@chaitanyahead @SaiKorrapati_ @CatherineTresa1 #ManiSharma @GarudaRam @VaaraahiCC pic.twitter.com/EKvRI0iJLC
— Sree Vishnu (@sreevishnuoffl) April 6, 2021