Homeటాప్ స్టోరీస్బొమ్మ‌ప‌డాలంటే ఇదంతా జ‌ర‌గాల్సిందే!

బొమ్మ‌ప‌డాలంటే ఇదంతా జ‌ర‌గాల్సిందే!

బొమ్మ‌ప‌డాలంటే ఇదంతా జ‌ర‌గాల్సిందే!
బొమ్మ‌ప‌డాలంటే ఇదంతా జ‌ర‌గాల్సిందే!

గ‌త ఏడు నెల‌లుగా లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్లు మూసివేసిన విష‌యం తెలిసిందే. ఎట్ట‌కేల‌కు థియేట‌ర్లు ఈ నెల 15 నుంచి పునః ప్రారంభం కానున్నాయి. ఇందు కోసం ఇప్ప‌టికే కేంద్రం అనుమ‌తులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. థియేట‌ర్లు, మ‌ల్టీప్లెక్స్‌ల‌లో త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కేంద్ర‌మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌డేక‌ర్ మంగ‌ళ‌వారం మీడియా ద్వారా వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గ‌త ఏడు నెల‌లుగా థియేట‌ర్లు మూసి వున్నాయి. అక్టోబ‌ర్ 15 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్ర‌జ‌ల ఆరోగ్య భ‌ద్ర‌త కోసం ప్ర‌భుత్వం సూచించిన నియ‌మాలు ఖ‌చ్చితంగా పాటించాల్సి వుంటుంది. సీటుకు సీటుకు మ‌ధ్య దూరంతో 50 శాతం సామ‌ర్ధ్యంతో సినిమా హాళ్లు న‌డుపుకోవ‌చ్చు` అన్నారు.

కేంద్రం థియేట‌ర్ల‌కు ప్ర‌క‌టించిన మార్గ‌ద‌ర్శ‌కాలివి:

- Advertisement -

*సీటుకు స‌టీఉకు మ‌ధ్య గ్యాప్‌తో 50 శాతం మంది ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తి.
*ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్‌లు విక్ర‌యించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
*సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల సంఖ్య‌కు త‌గ్గ‌ట్లుగా కౌంట‌ర్లు అందుబాటులోకి తేవాలి.
*టిక్కెట్లు రోజంతా విక్ర‌యించాలి. ర‌ద్దీని త‌గ్గించ‌డానికి ముంద‌స్తు బుకింగ్‌ల‌కు అనుమ‌తివ్వాలి.
*సినిమాకు వ‌చ్చిన వారు త‌ప్ప‌నిస‌రిగా భౌతిక దూరం పాటించాలి.
*భౌతిక దూరం కోసం టిక్కెట్ కౌంట‌ర్లు, థియేట‌ర్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వ‌ద్ద నేల‌పై గుర్తులు వేయాలి.
*థియూట‌ర్ల‌లోకి ప్ర‌వేశించే ముందు థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ చేయాలి. ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవ‌ని ధృవీక‌రించుకున్నాకే లోప‌లికి అనుమ‌తించాలి.
*ప్ర‌తీ ఒక్క‌రూ ఆరోగ్య‌సేతు యాప్ ఇన్‌స్టాల్ చేసి వుండాలి.
*థియేట‌ర్ ప్రాంగ‌ణంలో హ్యాండ్ వాష్‌, హ్యాండ్ శానిటైజ‌ర్‌లు అందుబాటులో వుండాలి.
*మ‌ల్టీప్లెక్స్‌ల‌లో వివిధ స్క్రీన్‌ల ప్ర‌ద‌ర్శ‌న‌ల మ‌ధ్య త‌గిన వ్య‌వ‌ధి వుండాలి. ఒకే స‌మ‌యంలో ప్రేక్ష‌కులు బ‌య‌టికి రాకుండా ప్ర‌ణాళిక‌లు రూపొందించి .. ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించాలి.
*థియేట‌ర్ల‌లో ఏయిర్‌కండీష‌నింగ్ ఉష్టోగ్ర‌త 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల‌ సెల్సియ‌స్ మ‌ధ్య వుండాలి. స‌రైన వెంటిలేష‌న్ వుంటేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.
*ప్యాక్ చేసిన ఆహారం, పానియాల‌ను మాత్ర‌మే అనుమ‌తించాలి. థియేట‌ర్‌లో అన్ని కౌంట‌ర్ల మ‌ధ్య సాధ్య‌మైనంత వ‌ర‌కు డిజిట‌ల్ చెల్లింపుల్ని ప్రోత్స‌హించాలి.
*థియేట‌ర్ స్క్నీన్ లోప‌ల ఆహారం డెలివ‌రీ చేయ‌డం నిషేధం.
*సినిమా హాల్లో ప్రేక్ష‌కులు పాటించాల్సిన అన్ని జాగ్ర‌త్త‌ల్ని స్క్నీనింగ్‌కి ముందు, త‌రువాత ప్ర‌క‌ట‌న‌లు వేయాలి.
*విరామ స‌మ‌యంలో సాధార‌ణ ప్రాంతాలు, వాష్‌రూమ్‌ల‌లో ర‌ద్దీని నివారించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలి.
*షో పూర్త‌య్యాక మ‌రో షో ప్ర‌ద‌ర్శించే ముందు..సీట్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా శానిటైజేష‌న్ చేయాలి.
*థియేట‌ర్ ప్రాంగ‌ణాన్ని రోజూ క్రిమిసంహార‌క ద్రావ‌ణంతో శుభ్రం చేయాలి.
*థియేట‌ర్ల‌లోని అన్ని ర‌కాల సిబ్బంది పీపీఈలు, చేతి తొడుగులు, బూట్లు, మాస్క్‌లు ఉప‌యోగించాలి.
*ఉమ్మివేయ‌డం నిషేధం.
*విశ్రాంతి స‌మ‌యంలో ప్రేక్ష‌కులు అటూ ఇటూ క‌ద‌ల‌కుండా సీట్లలో వుండేలా ప్రోత్స‌హించాలి.
*థియేట‌ర్ల లోప‌ల, బ‌య‌ట క్ర‌మం త‌ప్ప‌కుండా డిస్ ఇన్‌ఫెక్ట్ చేయాలి.
*పార్కింగ్‌, మిగ‌తా స్థ‌లాల్లో జ‌నం గుమిగూడ‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.
*ప్రేక్ష‌కులంద‌రి కాంటాక్ట్ నెంబ‌ర్లు తీసుకోవాలి. భ‌విష్య‌త్తులో ఎవ‌రికైనా పాజిటివ్ వ‌స్తే ట్రేసింగ్ కోసం దాన్ని ఉప‌యోగించాలి.
*థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు వ్య‌వ‌హ‌రించే విధానంపై (డూస్ అండ్ డోంట్స్‌) బాగా క‌నిపించే చోట బోర్డ్‌లు ఏర్పాటు చేయాలి.
*కోవిడ్ -19 సోకే ముప్పు ఎక్కువ‌గా వున్న‌ సిబ్బందిని ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్య‌క్ష సంబంధ కార్య‌క‌లాపాల్లో నియ‌మించ‌కూడ‌దు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All