Homeటాప్ స్టోరీస్సెన్సార్ ఇబ్బందుల్లో బయోపిక్

సెన్సార్ ఇబ్బందుల్లో బయోపిక్

Censor problems facing Thackeray biopicబాలీవుడ్ లోను , టాలీవుడ్ లోను బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది . ఇప్పటికే పలు బయోపిక్ లు సంచలన విజయాలు సాధించగా తాజాగా మరికొన్ని బయోపిక్ లు లైన్ లో ఉన్నాయి . ఇక బాలీవుడ్ లో తాజాగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ ” థాకరే ” . ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ ఇబ్బందుల్లో చిక్కుకుంది . మహారాష్ట్ర లోనే కాకుండా యావత్ భారతదేశంలోనే ప్రముఖ వ్యక్తి బాల్ థాకరే అన్న విషయం అందరికీ తెలిసిందే .

శివసేన అధినేతగా మహారాష్ట్ర పై తీవ్ర ప్రభావం చూపించిన వ్యక్తి బాల్ థాకరే . ఆయన జీవిత కథతో రూపొందుతున్న చిత్రం ” థాకరే ” . నవాజుద్దీన్ సిద్ధికి బాల్ థాకరే పాత్రలో నటిస్తుండగా ఆయన భార్య మీనా పాత్రలో అమృతారావు నటిస్తోంది . చిత్ర నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని 2019 జనవరి 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . జనవరి 23 బాల్ థాకరే పుట్టినరోజు కావడంతో ఆ రోజున విడుదల చేయనున్నారు . అయితే సెన్సార్ బోర్డు కొన్ని డైలాగ్స్ కు కట్ చెప్పిందట . ఆరు డైలాగ్ లతో పాటుగా రెండు సన్నివేశాలను కూడా తొలగించాలని డిమాండ్ చేసిందట కేంద్ర సెన్సార్ బోర్డు దాంతో చిత్ర బృందం తీవ్ర తర్జన భర్జన పడుతోంది . మొత్తానికి రిలీజ్ కి ఇంకా సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు సెన్సార్ సమస్య ఓ కొలిక్కి రావచ్చు .

- Advertisement -

English Title: Censor problems facing Thackeray biopic

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All