అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ” టార్చిలైట్ ” అనే సినిమా సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొంటోంది . సీనియర్ హీరోయిన్ సదా వేశ్యగా నటించిన చిత్రం ” టార్చిలైట్ ”. మజీద్ దర్శకత్వంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది . అయితే షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా సెన్సార్ కి వెళ్ళింది అయితే సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో ఇక్కడ సెన్సార్ చేయడానికి నిరాకరించారట .
దాంతో సెంట్రల్ లో తేల్చుకుందామని వెళ్లారు సదరు చిత్ర బృందం . సదా గ్లామర్ పాత్రలో అందాలను ఆరబోసిందని , వేశ్య పాత్రలో కొన్ని సన్నివేశాలు మరీ శృతిమించి ఉన్నాయని అందుకే ఇక్కడ సెన్సార్ చేయలేమని తేల్చి చెప్పారట ! ఢిల్లీ వీధుల్లో టార్చిలైట్ భవితవ్యం తేల్చుకోవడానికి వెళ్లారు .
హీరోయిన్ గా సదా జయం తో పరిచయమైంది , ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో సదా రేంజ్ మారిపోయిందని అనుకున్నారు కట్ చేస్తే ఆ స్థాయి విజయాలు అందుకోలేకపోయింది . కొన్ని హిట్స్ సాధించినప్పటికీ పాపం అనుకున్న రేంజ్ కి వెళ్లలేకపోయింది . దాంతో డ్యాన్స్ షోలు చేసుకుంటూ వస్తున్న ఈ భామకు వేశ్య పాత్ర లభించింది ఇంకేముంది రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించింది సెన్సార్ కి షాక్ ఇచ్చింది .