Homeన్యూస్విజయవాడలో... ‘సెలబ్రిటీ సీక్రెట్స్‌’ 3వ బ్రాంచ్ ఆరంభం

విజయవాడలో… ‘సెలబ్రిటీ సీక్రెట్స్‌’ 3వ బ్రాంచ్ ఆరంభం

celebrity secrets 3rd branch in vijayawada opening2012వ సంవత్సరంలో డాక్టర్‌ వెంకట్, డాక్టర్‌ మాధవి ‘సెలబ్రిటీ సీక్రెట్స్‌’ అనే పేరుతో హెయిర్‌ అండ్‌ స్కిన్‌ స్టూడియోను కాకినాడలో ప్రారంభించారు. అనతి కాలంలోనే చాలా మంచి పేరు రావటంతో 2016లో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో మరో బ్రాంచిని ప్రారంభించారు.

‘‘ఇక్కడ ఎంతోమంది సినిమా ప్రముఖులకు సేవ చేసే అదృష్టం మాకు లభించింది’’ అన్నారు నిర్వాహకులు వెంకట్, మాధవి గార్లు. ఇదే ఉత్సాహంతో తమ వినిమోగదారులు ఇచ్చిన ప్రోత్సాహంతో మూడవ ప్రాజెక్టును కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడలో ప్రారంభించారీ దంపతులు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీ యుతులు గద్దె రామ్మోహన్‌ గారు హాజరై భారతీనగర్‌ లోని నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీ నటులు పాల్గొన్నారు. వీరిలో ముఖ్యంగా సీనియర్‌ క్యారెక్టర్‌ నటీమణులు రజిత, హేమలతో పాటు ప్రముఖ నటులు ప్రవీణ కడియాల, హిమజ తదితరులు పాల్గొని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -

నటి హేమ మాట్లాడుతూ – ‘‘సెలబ్రిటీ సీక్రెట్స్‌’ పేరుతో ఇప్పటివరకు హైదరాబాద్‌లోని సెలబ్రిటీలకే కాకుండా విజయవాడ నగరంలోని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా తమ సేవలను విస్తృతం చేసినందుకు వెంకట్, మాధవిలను అభినంధిస్తున్నాను’’ అన్నారు.

నటి ప్రవీణ మాట్లాడుతూ – ‘‘సెలబ్రిటీ సీక్రెట్స్‌’ అధినేతలు, డాక్టర్స్‌ వెంకట్, మాధవిలకు ప్రొఫెషనల్‌గా ఎంత టాలెంట్‌ ఉందో మా అందరికీ తెలుసు. వ్యక్తిగతంగా కూడా ఇద్దరూ అందరితో కలుపుగోలుగా ఉంటారు. మేమందరం ఎప్పటినుండో వీరి వద్ద క్లైయింట్స్‌గా ఉన్నాం. మా స్కిన్‌ గ్లో, పట్టులాంటి జుట్టుకి కారణం సెలబ్రిటీ సీక్రెట్స్‌’’ అన్నారు.

స్టూడియో నిర్వాహకురాలు డాక్టర్‌ మాధవి మాట్లాడుతూ – ‘అత్యాధునిక టెక్నాలజీతో నైపుణ్యం గల సిబ్బంది పర్యవేక్షణలో హెయిర్‌ అండ్‌ స్కిన్‌’ ట్రీట్‌మెంట్స్‌ అందించనున్నాం. మా ప్రత్యేకతలు హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్, లేజర్‌ హెయిర్‌ రిమూవల్, స్లిమ్మింగ్, కాస్మోటిక్‌ సర్జరీ’’ అని తెలిపారామె.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All