Homeటాప్ స్టోరీస్బాలయ్య, బోయపాటి సినిమా మొదలైంది.. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై వారి స్పందన!

బాలయ్య, బోయపాటి సినిమా మొదలైంది.. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై వారి స్పందన!

బాలయ్య, బోయపాటి సినిమా మొదలైంది.. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై వారి స్పందన!
బాలయ్య, బోయపాటి సినిమా మొదలైంది.. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై వారి స్పందన!

ఎప్పటినుండో ఎదురుచూస్తోన్న హ్యాట్రిక్ కాంబో, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల సినిమా ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని బోయపాటి వెల్లడించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజండ్ లు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో తాజా బాలకృష్ణ 106వ చిత్రం హ్యాట్రిక్ అవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. సినిమా లాంచ్ తో పాటు ఒక డైలాగ్ ను కూడా వదిలారు. “నువ్వొక మాటంటే శబ్దం. అదే మాట నేనంటే అది శాసనం” అనే డైలాగ్ చాలా పవర్ఫుల్ గా ఉంది.

బోయపాటి రీసెంట్ గా ప్లాప్ కొట్టినా, బాలకృష్ణ రీసెంట్ ట్రాక్ రికార్డ్ ఏమంత బాలేకపోయినా వీరిద్దరూ కలిశారంటే ఆటోమాటిగ్గా అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఇక సినిమా లాంచ్ కార్యక్రమంలో ఇద్దరూ కూడా దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించారు.

- Advertisement -

ఈ ఘటనపై నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ దేవుడే పోలీసుల రూపంలో వచ్చి నిందితులను శిక్షించాడు. దిశ ఆత్మకు ఇప్పుడు శాంతి కలుగుతుంది అని వ్యాఖ్యానించాడు. ఇక బోయపాటి శ్రీను పోలీసుల నుండి ఎవరూ తప్పించుకోలేరని, తాజా ఘటన అందుకు సరైన ఉదాహరణ అని బోయపాటి అన్నారు. వీరిద్దరే కాక టాలీవుడ్ లో ఎందరో సెలబ్రిటీలు ఈ ఎన్ కౌంటర్ పై స్పందించారు.

న్యాచురల్ స్టార్ నాని అయితే విక్రమార్కుడు సినిమాలోని పంచ్ డైలాగ్ ను చెబుతూ అందరికీ కిక్కిచ్చాడు. “ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి.. ఆ ఒక్కడూ పోలీసోడు అయ్యుండాలి” అని ట్వీట్ చేసాడు నాని. ఎన్టీఆర్ స్పందిస్తూ “ఇప్పుడు న్యాయం జరిగింది. నీ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరాలి” అని ట్వీట్ చేసాడు. అల్లు అర్జున్ న్యాయం జరిగింది అని అర్ధం వచ్చేలా ఆంగ్లంలో ట్వీట్ చేసాడు. “నిన్ను కాపాడుకోలేకపోయాం, కానీ న్యాయం చేకూరింది. తెలంగాణ పోలీసులకు నా అభివాదాలు, నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా” అని యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేసాడు.

ఇక మంచు మనోజ్ కొంత ఎమోషనల్ గా స్పందించాడు. “ఆ బుల్లెట్టు దాచుకోవాలని ఉంది. ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉంది. ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని ఉంది. నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కుందా?? ఈ రోజే నీ ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లమ్మా” అని ట్వీట్ చేసాడు. ఇక హీరోయిన్లలో కూడా సమంత, నభ నటేష్ ఇంకా పలువురు ఈ విషయంపై స్పందించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All