Homeటాప్ స్టోరీస్సంజ‌న ఇంట్లో సోదాలు.. శాప‌నార్థాలు పెడుతోంది!

సంజ‌న ఇంట్లో సోదాలు.. శాప‌నార్థాలు పెడుతోంది!

సంజ‌న ఇంట్లో సోదాలు.. శాప‌నార్థాలు పెడుతోంది!
సంజ‌న ఇంట్లో సోదాలు.. శాప‌నార్థాలు పెడుతోంది!

చంద‌న సీమ‌లో డ్ర‌గ్స్ ప్ర‌కంప‌న‌‌లు సృష్టిస్తోంది. ఇటీవ‌ల బెంగ‌ళూరులో జ‌రిగిన సోదాల్లో భారీగా డ్ర‌గ్స్ బ‌య‌ట‌ప‌డ‌టం, క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చాలా మందికి డ్ర‌గ్ అల‌వాటుంద‌ని స‌ద‌రు డ్ర‌గ్ డీల‌ర్ వాంగ్మూలం ఇవ్వ‌డంతో సీసీబీ పోలీసులు రంగంలోకి దిగి జ‌ల్లెడ ప‌ట్ట‌డం మొద‌లుపెట్టారు. ఎవ‌రెవ‌రికి డ్ర‌గ్ అల‌వాటు వుంది? ఎవ‌రెవ‌రు డ్ర‌గ్ డీల‌ర్‌ల‌ని నేరుగా సంప్ర‌దిస్తున్నారని ఆరాతీసిన పోలీసులు మొత్తానికి హాట్ హీరోయిన్ రాగిణి దివ్వేదీని అదుపులోకి తీసుకున్నారు.

సోమ‌వారం ఆమెని వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా న్యాయ‌స్థానం ముందు విచార‌ణ‌కు నిల‌బెట్టారు. ఇక్క‌డి నుంచి క‌న్న‌డ సీమ‌లో డ్ర‌గ్స్ వివాదం సినీ ఫ‌క్కీలో కీల‌క మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా ప్ర‌భాస్ హీరోయిన్ సంజ‌న గ‌ల్రానీకి కూడా డ్ర‌గ్స్ అల‌వాటు వుంద‌ని ఆమె ఈవెంట్ మేనేజ‌ర్ చెప్ప‌డంతో మంగ‌ళ‌వారం సంజ‌న ఇంట్లో సీసీబీ పోలీసులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ప‌లు చోట్ల సోదాలు కొన‌సాగుతున్నాయి.

- Advertisement -

ఈ నేప‌థ్యంలో సంజ‌న త‌న‌కు డ్ర‌గ్స్ అల‌వాటుంద‌ని ఉప్పందించిన ప్ర‌శాంత్ నింబ‌ర్గీపై ఫైర్ కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఏడుస్తూ అత‌నిపై శాప‌నార్థాలు పెట్టింది. ఎట్టిప‌రిస్థితుల్లోనూ అత‌న్ని వ‌ద‌ల‌న‌ని, నిప్పులు చెరిగింది. కొంత భావోద్వేగానికి లోనై ఏడుపు అందుకుంది. త‌న‌కు ఎలాంటి డ్ర‌గ్స్ అల‌వాటు లేద‌ని, క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి వ‌చ్చాన‌ని, త‌న‌ని అన‌వ‌స‌రంగా ఈ కేసులో ఇరికిస్తున్నార‌ని, ఇంత‌టితో దీన్ని వ‌దిలేయండ‌ని విజ్ఞ‌ప్తి చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All