
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పలువురు రాజకీయ నాయకులతో పాటు సినీతారలు సామాన్య ప్రేక్షకులు సైతం సుశాంత్ మృతి వెనక ఏదో బలమైన మిస్టరీ దాగివుందని, ఈ కేసుని సీబీఐకి అప్పగించాలంటూ దేశ వ్యాప్తంగా డిమాండ్ మొదలైన నేపథ్యంలో ఈ కేసుని కేంద్రం, సుప్రీమ్ కోర్టు సీబీఐకి అప్పగించింది. ఇక్కడి నుంచి అసలు ఆట మొదలైంది.
కేసు పరిశోధన విషయంలో స్పీడు పెంచిన సీబీఐ ఇప్పటికే పలువురిని విచారించింది. ఆత్మ హత్య, మానసిక పరిస్థితికి సంబంధించిన విషయాల అధ్యాయనం కోసం సీబీఐ సైకలాజికల్ అటాస్పీ అనే కొత్త పద్దతిని పాటిస్తూ తాజాగా విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో సుశాంత్ సూసైడ్ చేసుకోవడానికి ముందు అతని మానసిక ప్రవర్తన ఏవిధంగా వుండేది? . వాట్సాప్ చాట్, తన ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులతో జరిపిన సంభాషణ వరకు ప్రతీ అంశాన్నీ పరిగనలోకి తీసుకుని విశ్లేషించనున్నారట.
ఇందుకు సంబంధించిన ప్రతీ అంశాన్ని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ అధ్యాయణం చేయనుందని తెలిసింది. ఆత్మ హత్యకు ముందు సుశాంత్ పరిస్థితి ఏంటి? హిందూజా ఆసుపత్రిలో అతను ఎవరెవరిని కలిశాడు. పోస్టు మార్టమ్ రిపోర్ట్ కూడా తాజా అధ్యయనంలో భాగమని చెబుతున్నారు. ఈ విధానాన్ని దేశంలో మూడవ సారి సీబీఐ ఉపయోగిస్తోంది. సునంద పుష్కర్ ఆత్మ హత్య, ఢిల్లీలో బురారీ ఫ్యామిలీ సామూహిక ఆత్మ హత్య ల విషయంలో సీబీఐ ఇదే విధానాన్ని అనుసరించింది.