Homeటాప్ స్టోరీస్సుశాంత్ సింగ్ మృతిపై సీబీఐ ఏం తేల్చ‌బోతోంది?

సుశాంత్ సింగ్ మృతిపై సీబీఐ ఏం తేల్చ‌బోతోంది?

సుశాంత్ సింగ్ మృతిపై సీబీఐ ఏం తేల్చ‌బోతోంది?
సుశాంత్ సింగ్ మృతిపై సీబీఐ ఏం తేల్చ‌బోతోంది?

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద మృతి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ కేసుని నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ముంబై పోలీసుల నుంచి  సీబీఐకి బ‌దాయించ‌డంతో దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రిగింది. దీంతో ఈ కేసు కొన్ని నెల‌ల పాటు వార్త‌ల్లో ప‌తాక శీర్షిక‌ల్లో నిలిచింది. ఇంత‌గా సంచ‌ల‌నం సృష్టించిన సుశాంత్ సింగ్ అనుమానాస్ప‌ద మృతి కేసు గ‌త కొన్ని నెల‌లుగా వార్త‌ల్లో క‌నిపించ‌డం లేదు. దీనిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేప‌థ్యంలో దీనిపై చ‌ర్చ‌ను కొంత కాలం మీడియాతో పాటు బాలీవుడ్ వ‌ర్గాలు ప‌క్క‌న పెట్టాయి.

ఈ కేసు వెన‌కున్న రహస్యాన్ని సిబిఐ బ‌య‌టికి తీస్తుంద‌ని అంతా భావించారు. తాజా స‌మాచారం ప్ర‌కారం సిబిఐ నివేదిక కూడా కొత్త‌గా ఏమీ లేద‌ని, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ హ‌త్య చేసుకుని చ‌పిపోయిన‌ట్టుగా సిబిఐ తేల్చింద‌ని తెలిసింది. దీంతో ఇంత కాలంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై ప‌లు అనుమానాల‌ని వ్య‌క్తం చేసిన ఆయ‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, ఫ్యాన్స్ షాక్ కు గుర‌వుతున్నార‌ట‌.

- Advertisement -

అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులోని ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నామని సిబిఐ చెబుతోంది.  అంతకుముందు సుశాంత్ ది హత్య కాదని, ఇది ఆత్మహత్య అని వైద్యుల బృందం తన అభిప్రాయంలో సిబిఐకి తెలిపింది. కానీ విషం ప్ర‌యోగంతో పాటు గొంతు పిసికి చంపిన‌ట్లు చాలా  హాగానాలు బ‌య‌టికి వ‌చ్చాయి. దీనిపై సిబిఐ ఇంత వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఈ కేసులో సరికొత్త శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి దర్యాప్తును సమగ్రంగా, వృత్తిపరంగా నిర్వహిస్తున్నట్లు సిబిఐ తెలిపింది. డిజిటల్ పరికరాల్లో లభ్యమయ్యే సంబంధిత డేటాను వెలికితీసి విశ్లేషించడానికి కేసుకు సంబంధించిన సంబంధిత సెల్ టవర్ స్థానాల  డేటాను విశ్లేషించడానికి తాజా సాఫ్ట్‌వేర్‌తో సహా అధునాతన మొబైల్ ఫోరెన్సిక్ పరికరాలను ఉపయోగిస్తున్నట్లు ఈ సంద‌ర్భంగా సిబిఐ తెలిపింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All