Homeటాప్ స్టోరీస్శర్వానంద్ సినిమాలో నటించాలని ఉందా ?

శర్వానంద్ సినిమాలో నటించాలని ఉందా ?

Casting call for Sharwanand 96 శర్వానంద్ సినిమాలో నటించాలని ఉందా ? ఉంటే వెంటనే వాళ్ళని సంప్రదిస్తే ఆ సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్ మీదే కావచ్చు . తమిళంలో సూపర్ హిట్ అయిన 96 చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు నిర్మాత దిల్ రాజు . అయితే ఆ సినిమాలో యంగ్ శర్వానంద్ కావాలి అంటే 14 ఏళ్ల వయసు నుండి 20 ఏళ్ల వయసు మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి దాంతో ఆ సన్నివేశాల్లో శర్వానంద్ నటిస్తే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది కాబట్టి శర్వా పోలికలకు దగ్గరగా ఉండేవాళ్ళలో కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలని ఇలా కాస్టింగ్ కాల్ కు సన్నాహాలు చేసారు .

శర్వానంద్ సమంత జంటగా నటించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది . తమిళంలో విజయ్ సేతుపతి పోషించిన పాత్రని తెలుగులో శర్వానంద్ పోషిస్తుండగా త్రిష పాత్రలో సమంత నటిస్తోంది . ఇంకెందుకు ఆలస్యం శర్వానంద్ పోలికలతో ఉన్నవాళ్లు సంప్రదించండి లక్కీ ఛాన్స్ కొట్టేయండి .

- Advertisement -

English Title: Casting call for Sharwanand 96

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All