Thursday, December 8, 2022
Homeటాప్ స్టోరీస్బ్రేకింగ్‌: సుశాంత్ గ‌ర్ల్‌ ఫ్రెండ్‌పై కేసు న‌మోదు!

బ్రేకింగ్‌: సుశాంత్ గ‌ర్ల్‌ ఫ్రెండ్‌పై కేసు న‌మోదు!

బ్రేకింగ్‌: సుశాంత్ గ‌ర్ల్‌ ఫ్రెండ్‌పై కేసు న‌మోదు!
బ్రేకింగ్‌: సుశాంత్ గ‌ర్ల్‌ ఫ్రెండ్‌పై కేసు న‌మోదు!

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఇది బాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. బంధుప్రీతి కార‌ణంగా సుశాంత్ చ‌నిపోయాడ‌ని నెటిజ‌న్స్ బాలీవుడ్ సెల‌బ్రిటీల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇదిలా వుంటే బిహార్‌లోని ముజాఫ‌రా పూర్‌కు చెందిన కుంద‌న్ కుమార్ తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య‌పై మ‌రో కేసు వేశాడు.

- Advertisement -

సుశాంత్ ఆత్మ హ‌త్య‌కు ఆయ‌న గ‌ర్ల్ ఫ్రెండ్ రియాచ‌క్ర‌వ‌ర్తి కూడా ఓ కార‌ణ‌మ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ తాజాగా ఆమెపై బీహార్‌లో కేసు ఫైల్ చేయించ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. సుశాంత్ ఆత్మ హ‌త్య‌పై ఇప్ప‌టి‌కే ముంబై పోలీ‌సులు వివిధ కోణాల్లో ద‌ర్యాప్తు ని ముమ్మ‌రం చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కుంద‌న్ కుమార్ తాజాగా సుశాంత్ గ‌ర్ల్ ఫ్రెండ్‌పై కేసు ఫైల్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

రియా చ‌క్ర‌వ‌ర్తిపై 306, 420 సెక్ష‌న్‌ల కింద కేసు ఫైల్ చేయించారు. దీనిపై కుంద‌న్ కుమార్ న్యాయ‌వాది ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న క్లైంట్ సుశాంత్ కు వీరాభిమాని అని, ఆయ‌న మ‌ర‌ణ వార్త‌ని జీర్ణించుకోలేక‌పోతున్నాన‌ని సుశాంత్ సినిమా అవ‌కాశాలు కోల్పోయిన స‌మ‌యంలో రియా అత‌న్ని మా‌న‌సికంగా ఇబ్బందుల‌కు గురిచేసింద‌ని ఆ కార‌ణంగానే త‌న క్లైంట్ ఆమెపై తాజాగా కేసు ఫైల్ చేశార‌ని స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల ముంబై బాంద్రా పోలీసులు రియాని 11 గంట‌ల పాటు ఇంట్రాగేషణ్ చేసిన విష‌యం తెలిసిందే.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts