Homeటాప్ స్టోరీస్అల్లు అర్జున్ చిత్రానికి నష్టాలు తప్పేలా లేవు

అల్లు అర్జున్ చిత్రానికి నష్టాలు తప్పేలా లేవు

buyers shocked with allu arjun naa peru surya naa illu indiaఅల్లు అర్జున్ ఎంతో ఇష్టపడి , కస్టపడి చేసిన చిత్రం ” నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా ” . వక్కంతం వంశీ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకొని సినిమా చేసాడు , పడిన కష్టానికి తప్పకుండా ప్రతిఫలం దక్కుతుందని భావించాడు కానీ సీన్ రివర్స్ అయ్యింది . నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనుకున్న రేంజ్ లో ఆడలేదు సరికదా కనీసం బయ్యర్ల కు కాస్త అయినా ఊరట నిస్తుందేమో అని అనుకుంటే కోలుకొని దెబ్బ కొట్టేలా ఉంది .

ఇప్పటివరకు కనీసం వంద కోట్ల గ్రాస్ వసూళ్ల ని కూడా రాబట్టలేదు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం . ఈ సినిమాకు దాదాపుగా 80 కోట్ల బిజినెస్ జరిగింది అంటే కనీసం 150 కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తే బయ్యర్లు ఒడ్డున పడతారు కానీ ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు . ఈ సినిమాని కొన్న వాళ్ళు పెద్ద ఎత్తున నష్టపోయేలా కనిపిస్తున్నారు . ఓవర్ సీస్ లో సైతం దిమ్మ తిరిగేలా బైర్లు కమ్ముతున్నాయి బయ్యర్ కి . మొత్తం మీద అల్లు అర్జున్ కు మాత్రమే మంచి పేరు వచ్చింది కానీ బయ్యర్లు మాత్రం నష్టం వచ్చేలా ఉండటంతో షాక్ అవుతున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All