
గత ఏడాది ప్రారంభంలో సంక్రాంతి బరిలో నిలిచి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన చిత్రం `అల వైకుంఠపురములో`. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి బన్నీ కెరీర్‌లోనే అత్యంత భారీ హిట్‌గా నిలిచింది. బన్నీ, త్రివిక్రమ్‌ల కలయికలో ముచ్చటగా మూడవ చిత్రంగా విడుదలైన ఈ మూవీ గత రికార్డులన్నింటినీ తిరగరాసి సంచలనం సృష్టించింది.
ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం ప్రధాన హైలైట్‌గా నిలిచి సినిమా విజయంలో కీలక పాత్రని పోషించింది. ఈ చిత్రంలోని పాటలన్నీ యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్‌ని రాబట్టి దక్షిణాదిలో సరికొత్త చరిత్ర సృష్టించాయి. వందల మిలియన్‌ల వ్యూస్‌ని రాబట్టి ఇప్పటికీ రికార్డులని నమోదు చేస్తూనే వున్నాయి. ఈ మూవీలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన `బుట్టబొమ్మ` సాంగ్ సరికొత్త ఫీట్‌ని సాధించి దక్షిణాది చిత్రాల్లో చరిత్ర సృష్టించింది. 600 మిలియన్ల వ్యూస్‌ని సాధించి వార్తల్లో నిలిచింది.
ఈ సందర్భంగా ఆదిత్య మ్యూజిక్ సంస్థ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. `లోకల్ దొరబాబు నుంచి డేవిడ్ వార్నర్ వరకు.. మొత్తం ప్రపంచంలోని 600 మిలియన్ల మనసులను `బుట్టబొమ్మ` సాంగ్ అలరించింది. ఇలాగే 1 బిలియన్ చేరుకుంటుందా?.. అవునో కాదో.. కామెంట్స్‌లో చెప్పిండి` అని ఆదిత్య సంస్థ ట్వీట్ చేసింది. దీనికి నెటిజన్‌లు `నో డౌట్.. త్వరలోనే ఆ మార్క్‌ను అందుకుంటుంది` అని కామెంట్స్ చేస్తున్నారు.
From our local Dorababu to David Warner.. #ButtaBomma has conquered a million sorry 600M hearts all over the world..
Can it make 1B?? Comment YES if you agree????????#AlaVaikunthapurramuloo @alluarjun #Trivikram @hegdepooja @MusicThaman @ArmaanMalik22 pic.twitter.com/F8myWQTdIR
— Aditya Music (@adityamusic) May 3, 2021
