Homeగాసిప్స్అల్లు అర్జున్ ఐకాన్ పై క్లారిటీ ఇచ్చిన బన్నీ

అల్లు అర్జున్ ఐకాన్ పై క్లారిటీ ఇచ్చిన బన్నీ

అల్లు అర్జున్ ఐకాన్ పై క్లారిటీ ఇచ్చిన బన్నీ
అల్లు అర్జున్ ఐకాన్ పై క్లారిటీ ఇచ్చిన బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో చిత్రం అనౌన్స్ అయిన కొన్ని రోజులకే బన్నీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఐకాన్ సినిమాను ఒప్పుకున్నాడు. ఇది జరిగి దాదాపు సంవత్సరం కావొస్తోంది. ఈ చిత్రాన్ని ప్రకటించేటప్పుడే టైటిల్ మరియు లోగోను కూడా సిద్ధం చేసారు. ఆ స్పీడ్ చూస్తే త్వరలో షూటింగ్ కూడా మొదలుపెట్టేసారు అనిపించింది. అల్లు అర్జున్ కూడా అప్పట్లో ఎక్కడికి వెళ్లినా ఐకాన్ అని ఉన్న టోపీనే పెట్టుకుని తిరిగాడు. దీంతో ఈ చిత్రం విషయంలో బన్నీ చాలా సీరియస్ గా ఉన్నాడని అర్ధమైంది. ఆ తర్వాత అల వైకుంఠపురములో షూటింగ్ తో అల్లు అర్జున్ బిజీ అయిపోవడంతో నెమ్మదిగా అందరూ ఈ విషయం మర్చిపోయారు. అయితే అల వైకుంఠపురములో పూర్తవుతుండగా సుకుమార్ సినిమాను ప్రకటించాడు బన్నీ.

ఐకాన్, సుకుమార్ చిత్రాల్లో ముందు ఏది చేస్తాడనేది చాలా త్వరగానే క్లారిటీ వచ్చేసింది. అల వైకుంఠపురములో పూర్తవ్వగానే సుకుమార్ సినిమాకు సిద్ధమవుతున్నట్లు బన్నీ వర్గాల నుండి కబురందింది. అల వైకుంఠపురములో రిలీజ్ కు సిద్ధమవుతుండడంతో త్వరలోనే అల్లు అర్జున్ సుకుమార్ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. అలాగే తన తర్వాతి సినిమాల విషయంలో కూడా క్లారిటీ తెచ్చుకున్నాడు. మురుగదాస్, హరీష్ శంకర్ లతో తన తర్వాతి సినిమాలను సెట్ చేసుకున్నాడు. మరి మురుగదాస్ తో సినిమా అంటే ఐకాన్ ఎప్పుడు చేస్తాడు మరి? అసలు చేసే ఉద్దేశం ఉందా? లేదా ఐకాన్ ను పూర్తిగా పక్కన పెట్టేస్తాడా?

- Advertisement -

వీటిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసాడు గీతా ఆర్ట్స్ వ్యవహారాలు చూసుకుంటున్న బన్నీ వాసు. కచ్చితంగా అల్లు అర్జున్ ఐకాన్ సినిమాను చేస్తాడని, ఈ కథా అతనికెంతో నచ్చిందని, తన కెరీర్ లో భిన్నమైన సినిమా అవుతుందనే నమ్మకం అతనికుందని బన్నీ వాసు తెలిపాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేదానిపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.

ఈ కథను తన కోసం పక్కనపెట్టి మిగిలిన సినిమాలు చేసుకోవాలని వేణు శ్రీరామ్ కు చెప్పేశాడట. అవకాశాన్ని బట్టి డేట్లు సర్దుబాటు చేసుకుని సినిమాను చకచకా పూర్తి చేసేద్దామని అన్నాడట. చూస్తుంటే ఐకాన్ ఇప్పట్లో ఉండేలా కనపడట్లేదు మరి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All