Homeటాప్ స్టోరీస్కేర‌ళ‌లో బ‌న్నీ ఫీవ‌ర్ పీక్స్‌కి వెళ్లింది!

కేర‌ళ‌లో బ‌న్నీ ఫీవ‌ర్ పీక్స్‌కి వెళ్లింది!

Bunny new record in Kerala
Bunny new record in Kerala

స్టైలిష్ స్టార్ బ‌న్నీకి ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో కేర‌ళ‌లో అంత‌కు మంచి వుంద‌టే అది అతి అనుకుంటారు. కానీ ఇది అక్ష‌రాలా నిజం. బ‌న్నీ సినిమాలంటే మాలీవుడ్‌లో భారీ క్రేజ్ వుంది. ఏ సినిమా వ‌చ్చినా స‌రే అక్క‌డి అభిమానులు చేసే హంగామా మామూలుగా వుండ‌దు. బ‌న్నీనుంచి ఈ మ‌ధ్య కాలంలో సినిమా వ‌చ్చి 18 నెల‌ల‌వుతోంది. ఇంత విరామం ఎప్పుడు రాలేదు. దీంతో బ‌న్నీ కొత్త సినిమా కోసం కేర‌ళ ప్రేక్ష‌కులు గ‌త ఏడాదిన్న‌ర‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు మించి ఎద‌రుచూస్తున్నారు.

`అల వైకుంఠ‌పుర‌ములో` ఈ నెల 12న తెలుగుతో పాటు మ‌ల‌యాళంలోనూ రిలీజ్ అవుతుండ‌టంతో అక్క‌డ బ‌న్నీ అభిమానుల హంగామా మొద‌లైంది. వీధి వీధి త‌రుగుతూ కేర‌ళ మొత్తం బ‌న్నీ పోస్ట‌ర్ల‌తో నింపేస్తున్నారు.  పైగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో బ‌న్నీ ఫీవ‌ర్ కేర‌ళ‌లో పీక్స్‌కి చేరుకుంది. మ‌రికొన్ని గంట‌ల్లో ఈ సినిమా విడుద‌ల‌వుతున్న నేప‌థ్యంలో కేర‌ళ‌లో కొత్త రికార్డుని నెల‌కొల్నింది.

- Advertisement -

బెనిఫిట్ షోల కోసం అక్క‌డి ప్రేక్ష‌కులు భారీ స్థాయిలో షోల‌ని ప్లాన్ చేశార‌ట‌. ఏకంగా 30 బెనిఫిట్ షోల‌ని ప్లాన్ చేయ‌డం ఓ రికార్డుగా చెబుతున్నారు. ఇంత‌కు ముందు బ‌న్నీ న‌టించిన ఏ చిత్రాల‌నికి ప్రేక్ష‌కులు ఈ స్థాయిలో బెనిఫిట్ షోల‌ని ప్లాన్ చేయ‌లేద‌ట‌. తొలిసారి 30 బెనిఫిట్ షోలని ఏర్పాటు చేస్తుండ‌టం విశేష‌మ‌ని చెబుతున్నాయి చిత్ర వర్గాలు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All