
ఈ ఏడాది సంక్రాంతి బరిలో పోటీపడిన చిత్రాలు మహేష్ `సరిలేరు నీకెవ్వరు`. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో`. ఈ రెండు చిత్రాల్లో దేశ భక్తి, సైనికులు దేశం కోసం ఎలాంటి త్యాగాలకు పూనుకుంటున్నారనే నేపథ్యంలో `సరిలేరు నీకెవ్వరు` చిత్రం తెరకెక్కింది. అనిల్ రావిపూడి దర్శకత్వలంలో అనిల్ సుంకర అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` ఇందుకు పూర్తి భిన్నంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మహేష్ `సరిలేరు నీకెవ్వరు` చిత్రాన్ని వెనక్కి నెట్టి సంక్రాంతి విజేతగా నిలిచింది. బాక్సాఫీస్ వంద వంద కోట్లకు మించి వసూళ్లని రాబట్టి నాన్ బాహుబలి రికార్డుని తిరగరాసింది. తాజాగా మరోసారి మహేష్ చిత్రాన్ని `అల వైకుంఠపురములో` వెనక్కి నెట్టడం ఆసక్తిగా మారింది.
మహేష్ బాబు నటించిన చిత్రం 23. 4 టీఆర్పీ రేటింగ్‌ని సాధించి రికార్డు సృష్టిస్తే తాజాగా ఆ రికార్డుని తిరగరాసి `అల వైకుంఠపురములో` ఆల్ టైమ్ రికార్డుని సొంతం చేసుకోవడం విశేషం. ఈ మూవీ టీఆర్పీ రేటింగ్ 29. 4. ఈ స్థాయిలో రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ సాధించిన టాప్ 5 చిత్రాల్లో `అల వైకుంఠపురములో` మొదటి స్థానంలో నిలిచింది. అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా `అల వైకుంఠపురములో` నిలవడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.