Homeటాప్ స్టోరీస్'బుల్లెట్' సాంగ్ కోసం మేకర్స్ ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..?

‘బుల్లెట్’ సాంగ్ కోసం మేకర్స్ ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..?

The Warriorr Bullet Song
The Warriorr Bullet Song

హీరో రామ్..ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్లో ది వారియర్ అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ లోని బుల్లెట్ సాంగ్ శుక్రవారం విడుదలై యూట్యూబ్ లో దుమ్ములేపుతుంది. కోలీవుడ్​ హీరో శింబు ఈ సాంగ్ ను పాడడం విశేషం. దేవి శ్రీ మరో సారి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వగా..శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసాడు. రామ్ – కృతి శెట్టి లు ఇద్దరు కూడా అదిరిపోయే స్టెప్స్ వేసి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి నటిస్తోంది.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సాంగ్ కోసం మేకర్స్ మూడు కోట్లు ఖర్చు చేశారట. ఇక ఈ మూవీ లో ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో పోలీసాఫీసర్ గా రామ్ కనిపిస్తుండడం..రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆకట్టుకోవడం తో సినిమా ఫై ఆసక్తి పెరిగింది. జులై 14 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts