Homeగాసిప్స్వెంకీ మామ బడ్జెట్ పోటు.. అందుకే ఆ డేటు!

వెంకీ మామ బడ్జెట్ పోటు.. అందుకే ఆ డేటు!

వెంకీ మామ బడ్జెట్ పోటు.. అందుకే ఆ డేటు!
వెంకీ మామ బడ్జెట్ పోటు.. అందుకే ఆ డేటు!

అక్కినేని – దగ్గుబాటి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా చిత్రం వెంకీ మామ. వెంకటేష్ – నాగ చైతన్య కలిసి నటించిన ఈ మల్టి స్టారర్ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఇంకా ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు.గత కొన్ని నెలలుగా సినిమా రిలీజ్ తేదీపై నిర్మాత సురేష్ బాబు చర్చలు జరుపుతూనే ఉన్నారు.
అయితే సినిమా ఆలస్యమవ్వడానికి ప్రధాన కారణం సినిమాకు పెట్టిన బడ్జెట్ అని తెలుస్తోంది. సాధారణంగా సురేష్ బాబు ఒక సినిమాను రిలీజ్ చేస్తున్నారు అంటే దాంతో డబుల్ ప్రాఫిట్స్ ఎలా రాబట్టలా అని రిలీజ్ ప్లాన్ రెడీ చేసుకుంటారు. చిన్న బడ్జెట్ సినిమాలకే నెలలపాటు చర్చలు జరిపే ఆయన ఇప్పుడు 40కోట్లకు పైగా ఖర్చు చేసి వెంకీమామ ని నిర్మిస్తున్నారు. సాధారణంగా సినిమాను 30కోట్ల లోపే తెరకెక్కించాలని అనుకున్నారు.
కానీ అనుకోని విధంగా బడ్జెట్ డోస్ పెరుగుతూ వచ్చింది. అందుకే సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ఇష్టపడటం లేదు. మహేష్ – బన్నీ సినిమాల మధ్య హోరాహోరీగా బాక్స్ ఆఫీస్ ఫైట్ కి రంగం సిద్దమవ్వడంతో వాటి మధ్యలో వెంకీమామను రిలీజ్ చేసి రిస్క్ లో పడకూడదని డిసైడ్ అయ్యారు. ఫైనల్ గా ఎవరు లేని సమయంలో జనవరి 26న సినిమాను రిలీజ్ చేయాలనీ సురేష్ బాబు ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All