హీరోయిన్ అంజలి – హీరో జై లు కొంతకాలంగా సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే . అయితే తాజాగా మాత్రం ఆ ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది అందుకు సంకేతంగా అంజలి పుట్టినరోజు ని ఉదహరించొచ్చు . అంజలి పుట్టినరోజు జూన్ 16 కాగా ఈ ఏడాది ఆమె పుట్టినరోజున పలువురు సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు కానీ హీరో జై మాత్రం ఆమెని కలవలేదు , కనీసం జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేయలేదు . దాంతో అంజలి – జై లు విడిపోయారని తమిళనాట గుసగుసలు జోరందుకున్నాయి .
జర్నీ చిత్రంలో నటించిన సమయంలో అంజలి – జై ల మధ్య ఎఫైర్ మొదలయ్యింది , ఆ సినిమా తర్వాత ప్రేమలో పడిన ఈ ఇద్దరు కూడా ఒకే అపార్ట్ మెంట్ లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు . అయితే కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని అందుకే వేరుగా ఉంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి . అసలు పెళ్లి చేసుకోవడమే తరువాయి అని అనుకుంటున్న సమయంలో విడిపోవడం షాకింగ్ న్యూసే ! తెలుగు భామ అయిన అంజలి తాజాగా తెలుగు, తమిళ బాషలలో ” గీతాంజలి 2 ” ని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది .